ప్రమాదాలను ఇలా అధిగమించాలి.. | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాలను ఇలా అధిగమించాలి..

May 31 2026 4:41 AM | Updated on May 31 2026 4:41 AM

పర్వతాలపై ప్రకృతి మన నియంత్రణలో ఉండదు. ప్రధానంగా తీవ్రమైన చలి వల్ల చేతులు, కాళ్ల వేళ్లకు రక్తం ప్రసరించదు. వేళ్లను తరచూ కదిలిస్తూ ఉండాలి. ఒకవేళ మొద్దుబారినట్లు అనిపిస్తే వెంటనే కింది క్యాంపునకు దిగిపోవాలి. అనుభవజ్ఞులైన ‘షెర్పా’ గైడ్‌ల పర్యవేక్షణలోనే ఉండాలి. అక్కడ ఒక అగ్గిపెట్టె బరువు కూడా వంద కిలోలుగా అనిపిస్తుంది. అనవసరమైన బరువులు లేకుండా శరీరాన్ని సిద్ధం చేసుకుని వెళ్లడమే సురక్షితం. 8వేల మీటర్ల ఎత్తు తర్వాత ఆక్సిజన్‌ స్థాయి 5 నుంచి 10 శాతం మాత్రమే. ఆక్సిజన్‌ లెవల్స్‌ తక్కువగా ఉన్న ప్రాంతాన్ని డెత్‌ జోన్‌ అంటారు. ఇక్కడ ఆక్సిజన్‌ సిలిండర్లు సరిగా ఉపయోగించాలి. ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. 2015, 2019లో మంచు చరియలు విరిగిపడి ఎంతో మంది పర్వతారోహకులు ప్రాణాలు

కోల్పోయారు.

పార్థివ

దేహాలను అక్కడే

వదిలేస్తారు

Advertisement
 
Advertisement
Advertisement