ప్రజలకు మరింత చేరువ కావాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు మరింత చేరువ కావాలి

May 29 2026 2:13 AM | Updated on May 29 2026 2:13 AM

రామగిరి(నల్లగొండ) : విలేజ్‌ పోలీస్‌ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ అన్నారు. నల్లగొండ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిస్థితులు, పెండింగ్‌ కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు తదితర అంశాలపై సమీక్షించారు. స్టేషన్‌లో రికార్డులు, క్రైం ప్రాపర్టీలు, సీజ్‌ చేసిన వాహనాలు, సీసీ కెమెరా పనితీరు, కోర్టు సంబంధిత రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్‌ పోలీస్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు చేరువ కావాలన్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గ్రామస్థాయి సమాచార వ్యవస్థను సమర్థంగా వినియోగించాలని ఆదేశించారు. సైబర్‌ నేరాలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తనిఖీలో డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐలు ఆదిరెడ్డి, రాఘవరావు, ఎస్‌ఐ సైదాబాబు, సిబ్బంది ఉన్నారు.

ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

Advertisement
 
Advertisement
Advertisement