వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఎన్నిక

May 29 2026 2:13 AM | Updated on May 29 2026 2:13 AM

నార్కట్‌పల్లి : టీజీఎస్‌ ఆర్‌టీసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ రీజియన్‌ స్థాయి కార్యవర్గాన్ని గురువారం నార్కట్‌పల్లిలో ఎన్నుకున్నారు. రీజియన్‌ అధ్యక్షుడిగా కొర్ర లింగానాయక్‌, కార్యదర్శిగా పండి యాదయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బండారు జానకిరాములును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో గడ్డం శ్రీనివాస్‌, బట్టు రాజయ్యనాయక్‌, బిబి.సింగ్‌ రాథోడ్‌, కావలి నిరంజన్‌, కడియం రమేష్‌, గాదె లక్ష్మయ్య, కె.శ్యాంసుందర్‌ తదితరులు ఉన్నారు.

సామూహిక పోరాటాలతోనే తెలంగాణ సాకారం

మిర్యాలగూడ టౌన్‌ : సబ్బండ వర్గాల సామూహిక ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్ర సాకారమైందని సామాజికవేత్త, తొలి, మలిదశ ఉద్యమకారుడు డాక్టర్‌ జాడీ రాజు అన్నారు. గురువారం స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ భవనంలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన నాయకులను గుర్తించి, గౌరవంగా సత్కరించాల్సిన అవసరం ఉందన్నారు. జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారులను సత్కరించేందుకు సిద్ధం కావడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఉద్యమ నేత మాళోతు దశరథనాయక్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, మాడుగుల శ్రీనివాస్‌, ధీరావత్‌ లింగానాయక్‌, క్రాంతికుమార్‌, బంటు వెంకటేశ్వర్లు, మురళియాదవ్‌, నాగేశ్వర్‌రావు, ఇక్బాల్‌, జయరాజు, నీలకంఠం, కిరణ్‌, కోల సైదులు, చిదేళ్ల సత్యనారాయణ, కృష్ణయ్య, లింగయ్య, గంధం సైదులు, చిలుకూరి శ్యాం, షోయబ్‌, నాగరాజు, మధుసూధన్‌, రాజ్‌కుమార్‌, ఎంవీఆర్‌ రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లు

త్వరగా పూర్తిచేయాలి

మర్రిగూడ : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని కోరారు. గురువారం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున, ఎలాంటి కొర్రీలు పెట్టకుండా కొనుగోళ్లు చేపట్టాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, పేదలందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో పేద, మధ్య తరగతి ప్రజల బతుకులు భారంగా మారాయని అన్నారు. ప్రధాని మోదీ విధానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట చల్లం పాండురంగారావు, ఆర్‌.అంజయ్యచారి, నలభరాజు రామలింగయ్య, ఈదుల భిక్షంరెడ్డి, బుర్ర శేఖర్‌, ఎరుకల నిరంజన్‌, ఆకుల రఘుమయ్య, జక్కలి అంజయ్య, కల్లెట్ల లింగయ్య, అయితగోని వెంకటయ్య, బాలకిషన్‌, అల్వాల్‌ నరసింహ, బోడ అంజయ్య, కృష్ణయ్య, నజీర్‌, యాదయ్య, రామచంద్రం, మహేందర్‌, శేఖర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement