మిర్యాలగూడ : మండలంలోని శ్రీనివాస్‌నగర్ గుమస్తాల కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద మౌలిక వసతులు కల్పించే పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. గురువారం ఆయన.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 2న లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించామని, ఈనెల 30లోపు పనులన్నీ పూర్తి చేయాలన్నారు. శానిటేషన్, గదుల శుభ్రత, పెయింటింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, రోడ్లపై గుంతలను పూడ్చివేయాలన్నారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, డీఈలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పనుల పరిశీలన
తిప్పర్తి : డబుల్‌బెడ్ రూం ఇళ్ల వద్ద మిగిలి ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం తిప్పర్తి మండల కేంద్రంలోని డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇళ్ల వద్ద విద్యుత్, శానిటేషన్ తదితర పనులు పూర్తి చేయాలని సూచించారు. పనుల నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ జ్యోతి తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


