ఆర్మీ లెఫ్టినెంట్‌గా సుధాకర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్మీ లెఫ్టినెంట్‌గా సుధాకర్‌

Apr 5 2026 9:30 AM | Updated on Apr 5 2026 9:30 AM

నల్లగొండ : నల్లగొండ ఎన్జీ కాలేజీ ఇంగ్లిష్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ చిలుముల సుధాకర్‌ నేషనల్‌ కేడెట్‌ కాప్స్‌ (ఎన్‌సీసీ)లో అసోసియేట్‌ ఎన్‌సీసీ ఆఫీసర్‌ (ఏఎన్‌ఓ)గా అర్హత సాధించారు. లెఫ్టినెంట్‌ హోదాతో ఆర్మీ ఆఫీసర్‌ ర్యాంకు పొందాడు. ఈయన మహారాష్ట్రలోని నాగపూర్‌ ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో జనవరి 5 నుంచి ఏప్రిల్‌ 4 వరకు సైనిక శిక్షణను పూర్తి చేశాడు. ఈ శిక్షణలో ఫైరింగ్‌, వెపన్‌ హ్యాండ్లింగ్‌, ఫీల్డ్‌ క్రాఫ్ట్‌, డ్రిల్‌, ఫిజికల్‌ ట్రైనింగ్‌, నాయకత్వ లక్షణాల అభివృద్ధి వంటి అంశాల్లో శిక్షణ పొందాడు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌, సిబ్బంది, విద్యార్థులు సుధాకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement