నల్లగొండ టూటౌన్ : నైపుణ్యాలు గల విద్యార్థులకు విస్తృత ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. శనివారం యూనివర్సిటీలో నిర్వహించిన జాబ్ మేళాకు 700 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ జాబ్‌మేళాలో 100 మందికిపైగా అభ్యర్థులు ఉద్యోగాలు పొందారని తెలిపారు. కార్యక్రమంలో ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ హరీష్‌కుమార్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ఆకుల రవి, ప్రదీప్‌రెడ్డి, భాస్కర్, యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.


