రాయితీ పొందు | - | Sakshi
Sakshi News home page

రాయితీ పొందు

Apr 5 2026 9:30 AM | Updated on Apr 5 2026 9:30 AM

ముందస్తుగా చెల్లించు..

నల్లగొండ టూటౌన్‌ : మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించిన వారికి 5 శాతం రాయితీ కల్పిస్తూ మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను మొత్తం ఒకేసారి చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తించనుంది. జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్‌, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్‌ మున్సిపాలిటీల్లోని భవన యజమానులకు రాయితీ ఇవ్వనున్నారు. ఐదు శాతం రాయితీ ఇస్తుండడంతో ఎక్కువ మంది ముందస్తుగా తమ ఆస్తిపన్ను చెల్లించడానికి మొగ్గు చూపుతున్నారు. దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి తద్వారా ఏప్రిల్‌ మాసంలోనే ఎక్కువ శాతం ఆస్తి పన్ను వసూలు చేసుకోవాలని మున్సిపల్‌, కార్పొరేషన్‌ అధికారులు లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.

బకాయిలతో సహ చెల్లిస్తేనే రాయితీ వర్తిపు..

పట్టణాలు, నగరంలోని నివాసాలు, బహుళ వాణిజ్య భవనాలకు గతంలో ఎలాంటి ఆస్తి పన్ను బకాయిలు లేని వారు మాత్రమే ఐదు శాతం రాయితీకి అర్హులు అవుతారు. 2026 మార్చి 31లోపు రూపాయి కూడా ఆస్తి పన్ను బకాయి ఉండకూడదు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం ఆస్తి పన్నును ఈనెల 30వ తేదీలోగా పూర్తిగా చెల్లించిన వారికి పన్నులో ఐదు శాతం రాయితీ ఇస్తారు. బకాయి ఉన్న వారు బకాయితో సహ చెల్లిస్తే ఈ ఏడాదికి సంబంధించిన పన్నులో ఐదు శాతం రాయితీ వర్తిస్తుంది. ఆస్తి పన్ను ఆలస్యంగా చెల్లిస్తే అపరాధ రుసుం పడుతుండడంతో.. ప్రజలు ఈ ఐదు శాతం రాయితీ వినియోగించుకుంటే లబ్ధి పొందవచ్చు.

నీలగిరి కార్పొరేషన్‌ టార్గెట్‌ రూ.8.50 కోట్లు

నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 44వేల భవనాలు ఉన్నాయి. సంవత్సరానికి ఆస్తి పన్ను డిమాండ్‌ సుమారు రూ.18 కోట్ల వరకు ఉండగా, మిర్యాలగూడ మున్సిపాలిటీలో 19 వేలకు పైగా భవనాలు ఉండగా రూ.25 కోట్లకు పైగా ఆస్తి పన్ను డిమాండ్‌ ఉంది. జిల్లాలో నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌, మిర్యాలగూడ మున్సిపాలిటీలు మాత్రమే పెద్దవి. మిగతా నాలుగు మున్సిపాలిటీలు చిన్నవి మాత్రమే. నీలగిరిలో ఈ ముందస్తు పన్ను రాయితీలో బాగంగా ఒక్క నెలలోనే రూ. 8.50 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

జూన్‌ దాటితే అపరాద రుసుం..

మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో ప్రతి ఆరు నెలలకు సంబంధించిన ఆస్తి పన్నును మొదటి మూడు నెలల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఆరు నెలల ఆస్తి పన్నును జూన్‌ నెలాఖరులోగా చెల్లించకుంటే ఆస్తి పన్నుపై అపరాధ రుసుం పడుతుంది. అదే విధంగా అక్టోబర్‌ నుంచి మరుసటి ఏడాది మార్చికి సంబంధించిన ఆరు నెలల ఆస్తి పన్నును డిసెంబర్‌ నెలాఖరులోగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రకారం ఆస్తి పన్ను చెల్లించని వారు అపరాధ రుసుంతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆస్తి పన్ను చెల్లింపులకు సంబంధించి గడువు ప్రకారం చెల్లించకపోతే ఆటోమెటిక్‌గా కంప్యూటర్‌లో అపరాధ రుసుంతో జనరేట్‌ అవుతుంది. దీనిపై చాలా మందికి సరైన అవగాహన లేకపోవడంతో అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తోంది. అపరాద రుసుం పడకుండా ఉండాలంటే ఏప్రిల్‌ నెలలోనే ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ పొందవచ్చు.

ఏడాది పన్ను ఒకేసారి చెల్లిస్తే ఐదు శాతం మినహాయింపు

ఫ మున్సిపాలిటీలు, నగరంలో ఈ నెలాఖరు వరకు చెల్లించేవారికి వర్తింపు

ఫ జూన్‌ దాటితే అపరాధ రుసుంతో కట్టాల్సిందే..

ఫ భవన యజమానులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement