కక్షిదారులకు సత్వర న్యాయం | - | Sakshi
Sakshi News home page

కక్షిదారులకు సత్వర న్యాయం

Apr 5 2026 9:30 AM | Updated on Apr 5 2026 9:30 AM

దేవరకొండ : కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా కృషి చేయాలని జిల్లా జడ్జి ఎం.నాగరాజు అన్నారు.

దేవరకొండ సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బార్‌ అసోసియేషన్‌, బీఎస్‌ ఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించి కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.అనిత, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.వి.ఎస్‌ హరీష్‌బాబు, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి స్నేహ, డీఎస్పీ శ్రీనివాసరావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉమమహేష్‌, వనం జగదీష్‌, గాజుల ఆంజనేయులు, నెమ్మికంటి రమాశంకర్‌, షౌకత్‌అలీ, శివకుమార్‌, వీరబాబు, గిరిధర్‌, సరిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement