బైపాస్‌ నిర్మాణంలో అన్నీ అవకతవకలే.. | - | Sakshi
Sakshi News home page

బైపాస్‌ నిర్మాణంలో అన్నీ అవకతవకలే..

Apr 5 2026 9:30 AM | Updated on Apr 5 2026 9:30 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి

నల్లగొండ టూటౌన్‌ : కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన నల్లగొండ బైపాస్‌ రోడ్డు నిర్మాణంలో అడుగడుగునా అవకతవకలు, నాసిరకం పనులు కనిపిస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ సమీపంలోని బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులు ఆయన బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. నిబందనలకు విరుద్ధంగా పనులు సాగుతున్నా మంత్రి కోమటిరెడ్డి పట్టించుకోవడం లేదని, కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. గ్రావెల్‌ (ఎర్రమట్టి)తో నిర్మాణం చేయాలనే నిబంధన ఉన్నా కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదన్నారు. కంచనపల్లి, దోమలపల్లి, పానగల్‌ ఉదయ సముద్రం, బుద్ధారం, అనంతారం, సాగర్‌ రోడ్డులో ఉన్న చెరువుల నుంచి మట్టి దందా చేసి పర్యావరణానికి నష్టం చేస్తున్న కాంట్రాక్ట్‌ సంస్థపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాధగోని శ్రీనివాస్‌గౌడ్‌, పోతెపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్‌రెడ్డి, కార్పొరేటర్లు దాసరి సాయి, రామగిరి అఖిల్‌రావు, వంగూరి రాఖి, ఫకీర్‌ మోహన్‌రెడ్డి, చింతా ముత్యాలరావు, దాసోజు యాదగిరాచారి, గాలి శ్రీనివాస్‌, ఆవుల మధు, ఆకునూరి సత్యనారాయణ, పాలకూరి రవి, శివరామకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, అనిల్‌, గడ్డం శాంతిస్వరూప్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement