చెత్త రీసైక్లింగ్ మొదలు
నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్ల వెంట, ఖాళీ స్థలాల్లో చెత్త పడేస్తున్నారు. కొద్ది మంది మాత్రమే మున్సిపల్ వాహనాలకు ఇస్తున్నారు. రోడ్ల వెంట వేసిన చెత్తను పందులు చిందర వందర చేస్తుండడంతో దుర్వాసన వస్తోంది. 48 వార్డుల నుంచి రోజుకు 100 మెట్రిక్ టన్నుల చెత్తను శేషమ్మగూడెంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. డంపింగ్ యార్డులో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో నానా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డంపింగ్ యార్డ్‌లో చెత్త కుప్పలను రీసైక్లింగ్ మిషన్‌ను ఇటీవల బిగించారు. ఇప్పటికే చెత్త రీసైక్లింగ్ ప్రక్రియ పనులు మొదలు పెట్టారు. చెత్త రీసైక్లింగ్‌కు ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తయితే ఇక్కడ సమస్య తీరనుంది.
చెత్త రీసైక్లింగ్ మొదలు


