ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ మద్దతుదారులకే అత్యధిక సర్పంచ్‌ స్థానాలు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ మద్దతుదారులకే అత్యధిక సర్పంచ్‌ స్థానాలు

Dec 18 2025 8:41 AM | Updated on Dec 18 2025 8:41 AM

 ఉమ్మ

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ మద్దతుదారులకే అత్య

మూడో విడతలోనూ..

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడతలోనూ కాంగ్రెస్‌ పార్టీదే పైచేయి అయ్యింది. మొదటి, రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు సర్పంచ్‌ స్థానాలు అధికంగా గెలుచుకోగా.. మూడో విడతలోనూ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులే ఎక్కువ మంది విజయం సాధించారు.

42 పంచాయతీలు ఏకగ్రీవం

మూడో విడత నల్లగొండ జిల్లాలోని దేవరకొండ డివిజన్‌లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 9 మండలాల పరిధిలో 269 గ్రామాల్లో సర్పంచ్‌లకు 2,206 వార్డు సభ్యులకు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే 42 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. వాటితో 596 వార్డులలో కూడా వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు 40 మంది సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఇద్దరు బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఎన్నికయ్యారు

227 పంచాయతీల్లో ఎన్నికలు

మూడో విడత ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా కొనసాగింది. మొత్తం 227 సర్పంచ్‌ స్థానాలకు, 1603 వార్డులకు ఎన్నికలు జరగ్గా 186 మంది కాంగ్రెస్‌ మద్దతుదారులు (40 మంది ఏకగ్రీవం కలుపుకొని) సర్పంచ్‌లుగా విజయం సాధించగా 56 మంది బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు (ఇద్దరు ఏకగ్రీవం) విజయం సాధించారు. ఇద్దరు బీజేపీ అభ్యర్థులు, బీజేపీ, సీపీఎం, సీపీఐతో పాటు స్వతంత్రులు 25 మంది విజయం సాధించారు. చందంపేట మండలంలోని పోలేపల్లిలో రీకౌంటింగ్‌ నిర్వహించి సర్పంచి అభ్యర్థుఽలను ప్రకటించారు.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగింది. ఆ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్‌ పార్టీకి 63.90 శాతం స్థానాలు లభించగా, బీఆర్‌ఎస్‌కు 26.71 శాతం స్థానాలు, బీజేపీకి 1.23 శాతం స్థానాలు వచ్చాయి. సీపీఐ/సీపీఎం/ఇతరులకు 8.15 శాతం స్థానాలు దక్కాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెల రోజులపాటు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం బుధవారంతో ముగిసింది. ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది. ఈ నెల 11, 14వ తేదీల్లో ఒకటి, రెండు విడతల ఎన్నికలు జరగ్గా, మూడో విడత ఎన్నికలు బుధవారం ముగిశాయి.

1,779 పంచాయతీల్లో ఎన్నికలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు విడతల్లో 1782 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అయితే, నల్లగొండ జిల్లాలోని అనుముల మండలం పేరూరు, మాడుగులపల్లి మండలం అభంగాపురంలో సర్పంచి అభ్యర్థుల్లేక సర్పంచ్‌ స్థానాలకు, అదే మండలంలోని ఇందుగులలో న్యాయ వివాదంతో సర్పంచ్‌తో సహా వార్డుల సభ్యుల స్థానాల ఎన్నికలు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని 1,779 గ్రామాల్లో సర్పంచ్‌ స్థానాలకు, 1,781 గ్రామాల్లో వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం జనగాం గ్రామంలో రాత్రి 11:30 గంటల వరకు కూడా లెక్కింపు పూర్తి కాలేదు.

వివిధ పార్టీల మద్దతుదారులకు ఇలా..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు వితల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకే అత్యధిక స్థానాలు దక్కాయి. సర్పంచి ఎన్నికలు జరిగిన 1,779 స్థానాల్లో (జనగాం మినహా) కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులకు 1,136 స్థానాలు దక్కాయి. బీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు 475 స్థానాలు వచ్చాయి. బీజేపీకి 22 స్థానాలు రాగా, సీపీఐ/సీపీఎం/ఇతరులకు 145 స్థానాలు లభించాయి. అందులో స్వతంత్ర అభ్యర్థులే అత్యధికంగా ఉండటం గమనార్హం.

నల్లగొండలోనే కాంగ్రెస్‌కు

అత్యఽధిక సర్పంచ్‌ స్థానాలు

నల్లగొండ జిల్లాలో 869 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో కాంగ్రెస్‌ మద్దతుదారులకు 68.23 శాతం స్థానాలు లభించాయి. బీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు 23.24 శాతం సర్పంచ్‌ స్థానాలు దక్కాయి. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్‌ మద్దతుదారులకు 64.60 శాతం, బీఆర్‌స్‌ మద్దతుదారులకు 25.51 శాతం దక్కాయి. యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్‌ మద్దతుదారులకు 53.75 శాతం, బీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు 34.97 శాతం సర్పంచి స్థానాలు లభించాయి.

 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ మద్దతుదారులకే అత్య1
1/2

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ మద్దతుదారులకే అత్య

 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ మద్దతుదారులకే అత్య2
2/2

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ మద్దతుదారులకే అత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement