నిబంధనలు అతిక్రమించొద్దు
చందంపేట : ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని డీఐజీ చౌహాన్ అన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సమస్యాత్మక గ్రామమైన చందంపేట మండలం కోరుట్లలో పోలింగ్ కేంద్రాన్ని బుధవారం ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. వారి వెంట డీఎస్పీ శ్రీనివాస్, సీఐ బీసన్న, ఎస్‌ఐ లోకేష్ ఉన్నారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
కొండమల్లేపల్లి : మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొండమల్లేపల్లి మండలం కేశ్యాతండా గ్రామ పంచాయతీ పరిధిలోని జోగ్యతండా వద్ద, కొండమల్లేపల్లిలో ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకురాలు కొర్ర లక్ష్మి పరిశీలించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ స్వర్ణలత పంచాయతీ కార్యదర్శి దాకునాయక్, వెంకటయ్య ఉన్నారు.
ప్రశాంతంగా పోలింగ్
దేవరకొండ : మూడో విడత పంచాయతీ పోలింగ్ దేవరకొండ డివిజన్‌లో ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. దేవరకొండ మండలం తాటికోల్‌లో మూడో విడత పంచాయతీ పోలింగ్ సరళిని బుధవా రం పరిశీలించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు ఉన్నారు.
నేడు నిరసన ర్యాలీ
నల్లగొండ : కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేంద్రం ఈడీ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ గురువారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిచనున్నట్టు డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం నిరసన ర్యాలీ చేపడతామని పేర్కొన్నారు.


