పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
దేవరకొండ : మూడో విడత పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో అలసత్వం చూపకూడదని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం దేవరకొండ పట్టణంలో ఎన్నికల విధులు నిర్వహించనున్న పోలీస్ సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. మూడో విడత ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, ప్రతి మండలానికి 200 మందికిపైగా డివిజన్‌లోని 9 మండలాల్లో మొత్తం 2వేల మంది పోలీసులకు విధులు కేటాయించామన్నారు. ప్రతి మండలానికి ఒక డీఎస్పీ స్థాయి అధికారిని నియమించామన్నారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచించారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్


