కాంగ్రెస్ ధర్నాను జయప్రదం చేయాలి
నల్లగొండ : జాతీయ ఉపాధిహామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్)లో మహాత్మాగాంధీ పేరును కేంద్ర ప్రభుత్వం తొలగించడాన్ని నిరసిస్తూ ఈ నెల 17న బుధవారం నల్లగొండలోని క్లాక్ టవర్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిచనున్నామని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ గాంధీజీ చిత్రపటాలతో నిరసన వ్యక్తం చేయనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.
‘రీజినల్’ పనులకు అనుమతులివ్వాలి
సాక్షి, యాదాద్రి : హైదరాబాద్ చుట్టూ ప్రణాళికాపరమైన పట్టణాభివృద్ధికి ర్యాపిడ్ ట్రాన్సిట్ కారిడార్ అభివృద్ధి ఎంతో అవసరమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ స్థాయి కమిటీ సమావేశంలో పలు అంశాలు చర్చించినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్, మెట్రో ఫేజ్–2, వంటి కీలక ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించాలని కోరినట్లు చెప్పారు. వీటన్నింటికి అనుమతులు లభిస్తే ప్రాంతీయ అభివృద్ధి జరుగుతుందని వివరిచినట్లు తెలిపారు.
సమస్యలు పరిష్కరించాలి
మఠంపల్లి: దేవాలయాల్లో భక్తులకు సేవలు అందిస్తున్న అర్చక, ఉద్యోగ, సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డీవీఎస్ శర్మ, దేవాదాయ శాఖ వెల్ఫేర్‌బోర్డు మెంబర్ సీహెచ్ శ్రవణ్‌కుమారాచార్యులు కోరారు. మంగళవారం మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో వారు మాట్లాడారు. ఆలయాల్లో కొంతమంది అధికారులు, ఉద్యోగులకు మాత్రమే ట్రెజరీల ద్వారా వేతనాలు అందుతున్నాయని, ఇదే తరహాలో అందరికీ వచ్చేలా చూడాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఈనెల 24న నల్లగొండ జిల్లా కనగల్ మండలం దర్వేశిపురం క్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర అర్చక, ఉద్యోగ సంఘం చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి జిల్లాలోని 6ఏ, 6బీ, 6సీ దేవాలయాల్లో పనిచేస్తున్న స్వీపరు నుంచి ప్రధాన అర్చకుల వరకు హాజరుకాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు దామోదర్‌రావు, ఉపేందర్‌రెడ్డి, అర్చకులు తూమాటి కృష్ణమాచార్యులు, తూమాటి శ్రీనివాసాచార్యులు, చివలూరి పద్మనాభాచార్యులు, దుర్గాప్రసాద్, బదరీనారాయణాచార్యులు, ఆంజనేయాచార్యులు, రాజేష్, రమేష్, అంజి పాల్గొన్నారు.
కాంగ్రెస్ ధర్నాను జయప్రదం చేయాలి


