తుది విడత దేవరకొండ డివిజన్‌లోని 227 పంచాయతీల్లో పోలింగ్
ఎన్నికల నిర్వహణ సిబ్బంది
స్టేజ్–1 ఆర్‌ఓలు 81
స్టేజ్–1 ఏఆర్‌ఓలు 81
వ్యయ పరిశీలకులు 09
స్టేజ్–2 ఆర్‌ఓలు 300
జోనల్ ఆఫీసర్లు 52
రూట్ ఆఫీసర్లు 82
పీఓలు 2,647
ఓపీఓలు 2,959
మైక్రో అబ్జర్వర్లు 89
దేవరకొండ : మూడో విడత పంచాయతీ పోరులో భాగంగా బుధవారం జిల్లాలోని దేవరకొండ డివిజన్‌లో పోలింగ్‌కు యంత్రాంగం సర్వం సిద్ధమైంది. ఈ మేరకు డివిజన్‌లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో 42 ఏకగ్రీవాలు మినహా 227 సర్పంచ్, 1,603 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు అధికారులు మొత్తం 1,827 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో పది ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతీ కేంద్రానికి ఒక పీఓ, ఒక ఏపీఓ, ఇతర ఎన్నికల సిబ్బందిని నియమించారు. నాలుగైదు పోలింగ్ కేంద్రాకు కలిపి ఒక జోనల్ ఆఫీసర్ చొప్పున 70 మందిని నియమించారు. 300 మంది రూట్ ఆఫీసర్లు విధుల్లో ఉండనున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు పోలింగ్ కేంద్రానికి స్టేజ్–2 రిటర్నింగ్ అధికారిని అందుబాటులో ఉంచారు. గ్రామాల్లో పోలింగ్ ప్రారంభం నుంచి ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ వరకు అంతా వీరి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
ఉదయం 7గంటల నుంచే..
పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగనుంది. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని అధికారులు ప్రకటించనున్నారు. కాగా ఎన్నికల విధులు నిర్వహించనున్న సిబ్బంది మంగళవారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి సిబ్బంది ఎన్నికల సామగ్రిని తీసుకొని ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ స్టేషన్లకు తరలివెళ్లారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలిచ్చారు.
పటిష్ట బందోబస్తు..
దేవరకొండ డివిజన్ పరిధిలో బుధవారం జరుగనున్న తుది విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డివిజన్‌లో సమస్యాత్మకమైనవిగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీస్ బలగాలను నియమించారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పోలీస్ అధికారులు పర్యవేక్షించనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2,78,940 మంది ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సజావుగా నిర్వహిం చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్ని పార్టీల శ్రేణులు, ప్రజలను పోలీస్ అధికారులు కోరుతున్నారు.
ఎన్నికలు జరిగే గ్రామాలు, ఓటర్ల వివరాలు ఇలా..
మండలం జీపీలు ఏకగ్రీవం ఎన్నికలు పోలింగ్ ఓటర్లు
జరిగేవి కేంద్రాలు
దేవరకొండ 41 06 35 280 35,716
మల్లేపల్లి 27 07 20 169 29,599
డిండి 39 04 35 299 41,525
చందంపేట 30 09 21 155 30,679
నేరెడుగొమ్ము 21 02 19 118 21,661
చింతపల్లి 36 04 32 271 45,054
పీఏపల్లి 25 05 20 180 23,864
గుడిపల్లి 12 00 12 70 12,271
గుర్రంపోడు 38 05 33 285 38,571
మొత్తం 269 42 227 1,827 2,78,940
ఫ పోలింగ్ కేంద్రాలకు చేరిన ఎన్నికల సామగ్రి, సిబ్బంది
ఫ ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఫ ఓటుహక్కు వినియోగించుకోనున్న 2.78 లక్షల మంది ఓటర్లు
తుది విడత దేవరకొండ డివిజన్‌లోని 227 పంచాయతీల్లో పోలింగ్
తుది విడత దేవరకొండ డివిజన్‌లోని 227 పంచాయతీల్లో పోలింగ్
తుది విడత దేవరకొండ డివిజన్‌లోని 227 పంచాయతీల్లో పోలింగ్


