పల్లె సారథులు వచ్చేస్తున్నారు
22న సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం
నల్లగొండ: గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియడంతో నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లతో పాటు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారానికి నిర్ణయించింది. ప్రభుత్వం మొదట ఈ నెల 20న సర్పంచ్‌ల ప్రమాణ స్వీకార సమయం ఖరారు చేసింది. ఆ రోజు మంచిగా లేకపోవడం, శనివారం కావడంతో 22వ తేదీకి వాయిదా వేసింది.
బాధ్యతలు చేపట్టనున్న కొత్త పాలకవర్గాలు
గ్రామ పంచాయతీల్లో ఇరవై రెండున్నర నెలలుగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. 2024 ఫిబ్రవరి 2న గత పాలక వర్గాల పదవీకాలం ముగియడంతో పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన పెట్టారు. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికి బీసీ రిజర్వేషన్ ప్రక్రియ కారణంగా అది జరగలేదు. దీంతో సంవత్సరం పదిన్నర నెలలుగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ఈ నెల 22వ తేదీన గ్రామ పంచాయతీలో కొత్త పాలక వర్గాలు ప్రమాణ స్వీకారం చేయనున్నాయి. జిల్లాలో గతంలో 844 గ్రామ పంచాయతీలు ఉండగా 25 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. మొత్తం 869 పంచాయతీలకు గాను ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా కోర్టు కేసు కారణంగా మాడ్గులపల్లి మండలం ఇందుగుల పంచాయతీలో ఎన్నికలు ఆగిపోయాయి. అదే మండలం అబంగాపురం గ్రామంలో ఎస్టీ రిజర్వు కావడం అక్కడ ఒక్కరు కూడా ఎస్టీ ఓటర్లు లేకపోవడంతో నామినేషన్లు రాలేదు. దాంతో అక్కడ ఎన్నిక నిలిచిపోయింది. అనుముల మండలం పేరూర్‌లో ఎస్టీ మహిళ రిజర్వు కావడంతో అక్కడా ఆ ఓటర్లు లేరు. దానికి తోడు 4 వార్డులు ఎస్టీ రిజర్వు కావడంతో గ్రామస్తులే ఎన్నిక బహిష్కరించారు. దీంతో జిల్లాలో ఈ మూడు పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోవడంతో 866 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఆయా పంచాయతీల్లో నూతనంగా ఎన్నికై న కార్యవర్గాలు ఈ నెల 22న కొలువుదీరనున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టడడంతో పంచాయతీ కార్యదర్శులకు భారం తగ్గనుంది. కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది.
ఫ ముహూర్తం ఖరారు చేసిన ప్రభుత్వం
ఫ కొలువుదీరనున్న 866 మంది సర్పంచ్‌లు
ఫ మూడు గ్రామాల్లో నిలిచిన ఎన్నికలు


