గ్రామ పాలనకో పాఠం
గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి మొదట్లో నాకు అవగాహన లేదు. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల అధికారాలు, విధులపై మా క్లాస్ సాంఘిక శాస్త్రంలో ఉన్న పాఠంలో వివరించారు. తద్వారా సర్పంచ్‌ల బాధ్యతల గురించి తెలిసింది.
– కొర్ర కిరణ్, ఆరో తరగతి విద్యార్థి
పెద్దవూర : పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అన్న జాతిపిత మహాత్మాగాంధీ మాటలను నిజం చేస్తోంది మన గ్రామ పాలన వ్యవస్థ. దీంతో గ్రామ పాలన పారదర్శంగా సాగించాలనే ఉద్దేశంతో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తూ ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్నారు. నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నినకల సందడి నెలకొంది. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అందరూ పల్లెపాలనపై చర్చించుకుంటున్నారు. గ్రామ పాలనపై పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించేలా ఆరో తరగతి సాంఘిక శాస్త్రంలో శ్రీగ్రామ పంచాయతీలుశ్రీ శీర్షికతో ఓ పాఠం చేర్చారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల అధికారాలు, విధులు, బాధ్యతలు, ప్రజల కర్తవ్యం, ప్రజాస్వామ్యం తదితర విషయాలను విద్యార్థులకు అవగాహన కల్పించేలా ఈ పాఠ్యాంశాన్ని పొందుపరిచారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు ముగిసిన సందర్భంగా ఆరో తరగతిలోని ఈ పాఠం ప్రాధాన్యత సంతరించుకుంది.
పౌరుల బాధ్యతలను విద్యార్థులకు వివరించేలా..
గ్రామసభ, సమావేశాలు, సమస్యల పరిష్కారం, పౌరుల బాధ్యతలు తదితరాలపై విద్యార్థులకు వివరించేలా ఈ పాఠ్యాంశంలో పొందుపరిచారు. గ్రామ పంచాయతీలకు ఆదాయం, వ్యయం, పన్నుల రకాలు, సర్పంచ్ కృషిచేస్తే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చు అన్న సూచనలు కూడా ఇందులో ఉన్నాయి. గ్రామ పంచాయతీల పాలనపై విద్యార్థులు అవగాహన పెంచుకుని తల్లిదుండ్రులకు కూడా వివరిస్తే పల్లెల్లో ప్రజా సమస్యలు పరిష్కారం కావడంతోపాటు పారదర్శకమైన పాలనను అందించవచ్చని ఈ పాఠ్యాంశం ఉద్దేశం. పంచాయతీ నూతన పాలకవర్గాలు కూడా ఈ పాఠంలో అంశాలను తెల్చుకుంటే తమ ఐదేళ్ల పాలన కాలంలో పల్లెలకు ఏమేమి చేయాలో అర్థమవుతుంది.
ఫ ‘గ్రామ పంచాయతీలు’ పేరుతో పాఠ్యాంశం
ఫ ఆరో తరగతి సాంఘిక శాస్త్రంలో పొందుపర్చిన ప్రభుత్వం
ఫ పాలకవర్గం విధులపై అవగాహన కల్పించేలా కూర్పు
గ్రామ పాలనకో పాఠం


