సంగ్రామం సమాప్తం | - | Sakshi
Sakshi News home page

సంగ్రామం సమాప్తం

Dec 18 2025 8:41 AM | Updated on Dec 18 2025 8:41 AM

సంగ్ర

సంగ్రామం సమాప్తం

మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 88.72 శాతం పోలింగ్‌

మూడో విడతలో మండలాల వారీగా పోలింగ్‌ వివరాలు...

మండలం మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు పోలింగ్‌ శాతం

చందంపేట 24,158 21,286 88.11

చింతపల్లి 42,651 38,384 90.00

దేవరకొండ 32,968 29,166 88.47

డిండి 12,271 11,034 89.92

గుండ్లపల్లి 39,391 34,241 86.93

గుర్రంపోడు 36,325 33,067 91.03

కొండమల్లేపల్లి 25,775 21,939 85.12

నేరడుగొమ్ము 18,894 17,286 91.49

పీఏపల్లి 24,702 21,732 87.98

మొత్తం 2,57,135 2,28,135 88.72

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ జోరు కొనసాగింది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల్లో బారులు తీరారు. మొదటి విడతలో 90.53 శాతం నమోదు కాగా.. రెండు, మూడో విడతలో స్వల్పంగా తగ్గింది. రెండో విడతలో 88.74 శాతం, మూడో విడతలో 88.72 శాతం పోలింగ్‌ నమోదైంది. కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో పాటు రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు లక్ష్మీ, డీఐజీ చౌహాన్‌, జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షించారు.

మొదటి రెండు గంటల్లోనే..

మూడో విడత ఎన్నికలు బుధవారం దేవరకొండ డివిజన్‌లోని 9 మండలాల పరిధిలో జరిగాయి. మొత్తం ఓటర్లు 2,57,135 మంది ఉన్నారు. ఇందులో మొదటి రెండు గంటల్లో అంటే ఉదయం 9 గంటల వరకు 29.06 శాతం పోలింగ్‌ నమోదైంది. 74,732 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకున్న వారి సంఖ్య 1,48,863కి చేరింది. పోలింగ్‌ 57.89 శాతానికి పెరిగింది. ఆ తరువాత నుంచి ఒంటి గంట వరకు 2,25,215 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో పోలింగ్‌ 87.59 శాతానికి చేరింది. పోలింగ్‌ ముగిసే సమయానికి మొత్తం ఓటర్లు 2,28,135 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 1,14,310 మంది, మహిళలు 1,13,816 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో మొత్తంగా 88.72 శాతం పోలింగ్‌ నమోదైంది.

అత్యధికంగా నేరడుగొమ్ములో..

మూడో విడత అత్యధికంగా నేరడుగొమ్ములో 91.49 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. తక్కువగా కొండమల్లేపల్లిలో 85.12 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇందులో మహిళల కంటే పురుషులే అత్యధికంగా ఓటు వేశారు. దేవరకొండ డివిజన్‌లో మొత్తం ఓట్లు 2,57,135 మంది ఓటర్లుండగా.. పురుషులే ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు.

ఊపిరిపీల్చుకున్న అధికారులు

పంచాయతీ ఎన్నికల మూడో విడత ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 11న చండూరు, నల్లగొండ డివిజన్‌ పరిధిలోని 14 మండలాల్లో పోలింగ్‌ పూర్తయింది. రెండో విడత మిర్యాలగూడ డివిజన్‌కు ఈ నెల 14న ఎన్నికలు ముగిశాయి. రెండు విడత ఎన్నికల్లోను చిన్న చిన్న సంఘటనలు జరిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని మూడో విడత ఎన్నికల నిర్వహణకు కలెక్టర్‌ పకడ్బందీగా ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందితోపాటు జిల్లా అధికారులను కూడా ఎన్నికల తీరును పరిశీలించేందుకు కేటాయించారు. జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ రెండు రోజుల నుంచి దేవరకొండ డివిజన్‌లోనే మకాం వేసి భద్రతను పర్యవేక్షించారు. రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు కొర్ర లక్ష్మితో పాటు డీఐజీ చౌహన్‌ కూడా పోలింగ్‌ తీరు, భద్రతను పర్యవేక్షించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీస్‌ బలగాలను నియమించారు.

సంగ్రామం సమాప్తం1
1/1

సంగ్రామం సమాప్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement