రెండో విడత పోలింగ్‌కు పటిష్ట భద్రత
మిర్యాలగూడ టౌన్ : రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. శనివారం దామరచర్ల మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలతో పాటు అక్కడి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో ఎన్నికలను ప్రశాంత వాతవరణంలో నిర్వహించేలా.. ప్రతి మండలానికి 200 మంది చొప్పున 2 వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మండలానికి ఒక డీఎస్‌పీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఎక్కడ సమస్య తలెత్తినా తక్షణమే అక్కడికి చేరుకొని పరిష్కరించేందుకు సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్(144 సెక్షన్) అమలులో ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఇంకు బాటిళ్లు, పెన్నులు అనుమతించమన్నారు. విజేతల ఊరేగింపు, డీజెలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. ఆయన వెంట డీఎస్‌పీ రాజశేఖర్‌రాజు, మిర్యాలగూడ రూరల్ ీసీఐ పీఎన్‌డీ ప్రసాద్ ఉన్నారు.
ఫ ఎస్పీ శరత్ చంద్రపవార్


