ఫ బరువు..బాధ్యత
ఆర్టీసీ కాదు.. ఎన్నికల బస్సు
తిరుమలగిరి(సాగర్) : గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో భాగంగా తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రలో ఏర్పాటు చేసిన డిస్టిబ్యూషన్ సెంటర్ నుంచి సిబ్బందిని పాఠశాల బస్సుల్లో వివిధ గ్రామాలకు తరలించారు. బస్సుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఎన్నికల సిబ్బంది నిల్చునే ప్రయాణించాల్సి వచ్చింది. ఒక చేత్తో సామాగ్రిని పట్టుకొని ఒంటికాలిపై నిలబడి ప్రయాణించాల్సి రావడంతో వారు ఇబ్బందులు పడ్డారు.
ఎన్నికల వేళ చికెన్ కొరత!
పెద్దవూర: గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు గాను అభ్యర్థులు చాలా గ్రామాలలో చికెన్, కూల్‌డ్రింక్స్, మద్యం పంపిణీ చేస్తున్నారు. పెద్దవూర మండలంలో ఏ గ్రామంలో చూసినా చికెన్ దుకాణాలలో శనివారం మధ్యాహ్నం కోళ్లు అయిపోయాయి. ఎన్నికల వేళ చికెన్ దుకాణాలు, కూల్‌డ్రింక్స్ దుకాణాల్లో భారీగా వ్యాపారం సాగింది.
రాజీనామా చేశారు.. సర్పంచ్‌గా గెలిచారు
ఆత్మకూరు(ఎం) : మండలంలోని మొదుగుకుంటకు
చెందిన సోలిపురం ఎల్లారెడ్డి, పల్లెపహాడ్‌కు చెందిన సుంకరి మంజుల గ్రామ వీఓఏలుగా పని చేస్తున్నారు. ఈ సారి గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు తమకు అనుకూలించడంతో సర్పంచ్ స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకే తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం జరిగిన ఎన్నికల్లో మోదుగుకుంట సర్పంచ్‌గా సోలిపురం ఎల్లారెడ్డి, పల్లెపహాడ్ సర్పంచ్‌గా సుంకరి మంజుల విజయం సాధించారు.
నాలుగోసారి వరించిన విజయం
తిప్పర్తి : మూడు సార్లు సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయినా నాలుగోసారి విజయం సాధించాడు తగుళ్ల శ్రీనయ్య. మండలంలోని సర్వారం గ్రామానికి చెందిన తగుళ్ల శ్రీనయ్య 2006లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్వారం సర్పంచ్ స్థానానికి సీపీఎం బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశాడు. 2013లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా ఓడిపోయాడు. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. అయినా నిరాశ చెందకుండా ప్రజలతో మమేకమవుతూనే వారి నమ్మకాన్ని సంపాదించాడు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేసి మండలంలోనే అత్యధికంగా 834 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు.
నాడు వార్డు మెంబర్.. నేడు సర్పంచ్
రాజాపేట : మండలంలోని బసంతపురం గ్రామానికి చెందిన మెండు రత్నమాల మూడు పర్యాయాలు వార్డు సభ్యురాలిగా విజయం సాధించాగా.. ఈ సారి సర్పంచ్‌గా గెలుపొందారు. బసంతపురం గ్రామపంచాయతీకి 2006లో జరిగిన ఎన్నికల్లో 4వ వార్డు సభ్యురాలిగా పోటీ చేసి విజయం సాధించారు. 2011లో 5వ వార్డు సభ్యురాలిగా, 2019లో 6వ వార్డు సభ్యురాలిగా గెలిచారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో బసంతపురం గ్రామ సర్పంచ్‌గా పోటీచేసి 88 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఫ బరువు..బాధ్యత
ఫ బరువు..బాధ్యత
ఫ బరువు..బాధ్యత
ఫ బరువు..బాధ్యత
ఫ బరువు..బాధ్యత
ఫ బరువు..బాధ్యత


