మీ ఓటు చెల్లదు
ముద్ర సరిగా వేయకుంటే..
ఫ మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో వందల సంఖ్యలో చెల్లని ఓట్లు ఫ ఓటర్లకు అవగాహన లేకనే ఇబ్బందులు
కేతేపల్లి : బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్‌పై గ్రామీణ ప్రాంత ప్రజలకు సరైన అవగాహన లేక పోవడం వల్లే పంచాయతీ ఎన్నికల్లో చెల్లని ఓట్ల సంఖ్య పెరుగుతోంది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. దాంతో పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపోటములు తారుమారవుతున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుడికి వేర్వేరుగా బ్యాలెట్ పత్రాలు ఉన్నాయి. ఒక ఓటు సర్పంచ్ అభ్యర్థికి, మరో ఓటు వార్డు సభ్యుడికి వేయాల్సి ఉన్నప్పటికీ కొందరు ఓటర్లు సర్పంచ్ బ్యాలెట్‌పైనే రెండు గుర్తులకు ఓటు వేసి వార్డు సభ్యుడి బ్యాలెట్‌పై ఓటు వేయకుండానే బ్యాలెట్ బాక్స్‌లో వేశారు. మరి కొందకు గుర్తులపై వేలిముద్రలు కూడా వేశారు. ఇంకొందరు బ్యాలెట్ పేపర్‌పై ఓటువేసి సరిగా మడత పెట్టక పోవడంతో వేరొక వైపు కూడా స్వస్తిక్ గుర్తు పడి ఓటు చెల్లకుండా పోయింది.
చెల్లని ఓట్లు 462
మొదటి విడుత పంచాయతీ ఎన్నికల్లో కేతేపల్లి మండల వ్యాప్తంగా 27,260 ఓట్లు పోలవ్వగా అందులో 462 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఒక్క కేతేపల్లిలోనే 101 ఓట్లు చెల్లకుండా పోయాయి. దాంతో పాటు
చెర్కుపల్లిలో 59, భీమారంలో 62, ఇనుపాములలో 30, కొత్తపేటలో 28, తుంగ
తుర్తిలో 27, గుడివాడలో 40, కొప్పోలులో 33, కొర్ల
పహాడ్‌లో 21, మిగతా అన్ని గ్రామాల్లోనూ 10 నుంచి 20 ఓట్లు చెల్లకుండా పోయాయి.
మెజార్టీ కంటే చెల్లని ఓట్లే అధికం
యాదగిరిగుట్ట రూరల్ : మొదటి విడుత పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే ఆయా గ్రామాల్లో చెల్లని ఓట్లు సర్పంచ్ అభ్యర్థుల విజయంపై ప్రభావం చూపాయన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.
● యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో 19 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించాడు. ఇక్కడ 26 ఓట్లు చెల్లకుండా పోగా 6 ఓట్లు నోటాకు వచ్చాయి.
● మసాయిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి 18 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా 23 ఓట్లు చెల్లకుండా పోయాయి.
మీ ఓటు చెల్లదు


