అభివృద్ధికి పాటుపడాలి
నల్లగొండ: గ్రామాల అభివృద్ధికి కొత్త సర్పంచ్‌లు పాటుపడాలని, ఎన్ని నిధులైనా కేటాయిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండలాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు శుక్రవారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి.. వారిని అభినందించి మాట్లాడారు. మంత్రిని కలిసిన వారిలో నల్లగొండ మండలం పెద్ద సూరారం, చెన్నుగూడెం, బుద్ధారం, చందనపల్లి, నర్సింగ్‌బట్ల, వెలుగుపల్లి, కాంచనపల్లి, తొర్రగల్, దొనకల్, తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామాల నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు ఉన్నారు.


