త్రివిధ దళాలకు ప్రతిఒక్కరూ సహకరించాలి
నల్లగొండ: దేశ రక్షణకు ప్రాణాలను ఫణంగా పెట్టి అహర్నిశలు కృషిచేస్తున్న త్రివిధ దళాలకు ప్రతిఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ నెల 7న సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లో సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని త్రివిధ దళాలకు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్రివిధ దళాలు దేశాన్ని రక్షిస్తున్నందునే అందరూ ప్రశాంతంగా బతుకగలుగుతున్నామన్నారు. అనంతరం కలెక్టర్‌కు సాయు ధ దళాల దినోత్సవ సూచికగా బ్యాడ్జిని అలంకరించారు. ముందుగా ఎన్‌సీసీ కేడెట్లు, స్కౌట్ గైడ్స్ కలెక్టర్‌కు డ్రమ్స్‌తో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి టి.వనజ, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, మాజీ సైనికుల సంక్షేమ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, జనరల్ సెక్రెటరీ సత్యనారా యణరాజు, శ్రీనయ్య, రాములు పాల్గొన్నారు.
పేద విద్యార్థులకు ఉపకార
వేతనం అందేలా చూడాలి
నల్లగొండ: ప్రతి పేద విద్యార్థికి ఉపకార వేతనం అందేలా చూడాలని అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపకార వేతనాల మంజూరుపై మండల విద్య, సంక్షేమ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వారం రోజుల్లో జిల్లాలో స్కాలర్‌షిప్‌లకు వచ్చే దరఖాస్తుల సంఖ్య 30 శాతం దాటేలా లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు. కుల ధృవీకరణ సర్టిఫికెట్లను తహసీల్దార్లు జాప్యం చేయకుండా జారీ చేయాలని, విద్యార్థులు బ్యాంక్ అకౌంట్ ప్రారంభించే విషయంలో బ్యాంక్ అధికారులు సహకరించాలన్నారు. విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలను గ్రీన్‌చానల్ ద్వారా జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎల్‌డీఎం శ్రామిక్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఉపకార వేతనాల కోసం ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశామని, ఆ గ్రూపులో సమస్యలను పోస్ట్ చేయాలన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఛత్రునాయక్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శశికళ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


