ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
కొండమల్లేపల్లి : ఎన్నికలు సజావుగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు కొర్ర లక్ష్మి అధికారులకు సూచించారు. శుక్రవారం కొండమల్లేపల్లి మండలంలోని కేశ్యతండా నామినేషన్ కేంద్రాన్ని ఆమె సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలని ఆదేశించారు. స్వీకరించిన పత్రాలను వెంటనే ఆన్‌లైన్ చేయాలన్నారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రానికి వచ్చిన అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట ఆర్డీఓ రమణారెడ్డి, ఎంపీడీఓ స్వర్ణలత, తహసీల్దార్ నరేందర్, ఎస్‌ఐ అజ్మీరా రమేష్, ఎన్నికల సిబ్బంది తదితరులు ఉన్నారు.
నామినేషన్ కేంద్రాల పరిశీలన
కొండమల్లేపల్లి(చింతపల్లి): గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు కొర్ర లక్ష్మి శుక్రవారం చింతపల్లి మండలంలో పర్యటించారు. చింతపల్లి క్లస్టర్ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం చింతపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి బాబా ఆశీర్వాదం అందించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆమెను శాలువాతో సన్మానించారు. ఆమె వెంట జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, ఆర్డీఓ రమణారెడ్డి, ఎంపీడీఓ సుజాత, తహసీల్దార్ విజయలక్ష్మి ఆలయ కమిటీ సభ్యులు కుంభం పుల్లారెడ్డి, తడకమళ్ల శ్రీనివాస్ తదితరులున్నారు.
ఫ రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు కొర్ర లక్ష్మి


