రెఫరెండం
రెఫరెండం దేశంలో చర్చనీయాంశమైంది
సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల్లో హామీలివ్వడం, ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడం.. ఆ తర్వాత ఇచ్చిన హామీలను మరిచిపోవడం పరిపాటి. కానీ, కొద్దిమంది ప్రజాప్రతినిధులు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయటంతోపాటు తమ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుని.. అందుకు అనుగుణంగా పనిచేస్తుంటారు. అలా నల్లగొండ జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు తమ పాలనపై రెఫరెండం నిర్వహించుకుని.. ప్రజాభిప్రాయం తీసుకున్నారు. ఈ రెఫరెండంలో ప్రజలు వీరికి బ్రహ్మరథం పట్టారు.
స్థానిక సంస్థల్లో
ఆలగడప మాజీ సర్పంచ్
వేనేపల్లి పాండురంగారావు
తమ పాలనపై ప్రజాభిప్రాయం తీసుకున్న ఇద్దరు సర్పంచ్‌లు, ఒక ఎంపీటీసీ
రెఫరెండంలో మరింత ఆదరణ పొందిన ఆ నాయకులు
మిర్యాలగూడ : దేశంలో 22ఏళ్ల క్రితం ఆ గ్రామం పేరు మారుమోగింది. ప్రజాస్వామ్యానికి జీవం పోసే విధంగా అప్పటి సర్పంచ్ తన పాలనపై పెట్టుకున్న రెఫరెండం దేశ వ్యాప్తంగా ప్రచారం జరిగింది. దేశంలోనే మొదటిసారిగా తన పాలనపై రెఫరెండం పెట్టుకొని గెలిచి తనకంటూ ఒక ముద్ర వేసుకోవడంతోపాటు గ్రామానికి పేరు తెచ్చి పెట్టాడు. వారసత్వంగా వచ్చిన ఆస్తిని సైతం పుట్టిన గడ్డ కోసం ఖర్చు చేసి ‘తెలంగాణ మట్టి మనిషి’గా పేరుతెచ్చుకున్నాడు. మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామంలో ‘మనిల్లు’ అని పేరు పెట్టుకుని ఎవరొచ్చినా ఆప్యాయంగా పలకరిస్తుంటాడు వేనేపల్లి పాండురంగారావు.
ప్రజలే నామినేషన్ వేయించారు..
ఊరి జనం మొత్తం పాండురంగారావును సర్పంచ్‌గా చేయాలని పలుమార్లు ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నించారు. మూడుసార్లు పోటీ చేయకుండా నిరాకరించాడు. ఎట్టకేలకు 2001లో ప్రజలే ఆయనతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయించారు. పాండురంగారావుకు కాంగ్రెస్, సీపీఎం మద్దతు తెలిపాయి. టీఆర్‌ఎస్ నుంచి ప్రత్యర్థి బరిలో ఉన్నాడు. పాండురంగారావు కేవలం రూ.200 ఖర్చు పెట్టి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామంలో అప్పుడు సుమారు 3,800 ఓట్లు ఉండగా 3,600 ఓట్లకు పైగా పోలయ్యాయి. అందులో పాండురంగారావుకు 2,800 ఓట్లు వచ్చాయి. ఇంకా 400 ఓట్ల పోలింగ్ చిట్టీలపై అభిమానులు నినాదాలు రాయడంతో అవి చెల్లలేదు. ప్రత్యర్థికి కేవలం 400 ఓట్లు వచ్చాయి. 1400 ఓట్ల మెజారిటీతో పాండురంగారావు గెలుపొందారు. సర్పంచ్ పదవి చేపట్టిన వెంటనే ఊరిలో సారా నిషేధం పెట్టాడు. ఎయిడ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేశారు. బడికి దూరంగా ఉన్న పిల్లలను గుర్తించి చాలా మందిని సొంత ఖర్చులతో చదివించారు.
2003లో రెఫరెండం..
పాండురంగారావు సర్పంచ్‌గా తన రెండేళ్ల పాలనపై 2003లో రెఫరెండం పెట్టుకున్నాడు. అప్పట్లోనే దేశానికి ఆలగడప పేరును పరిచయం చేశాడు. ‘పదవిలో నేను ఉండాలా.. వద్దా..’ అని బ్యాలెట్‌లు ముద్రించి పోలింగ్ నిర్వహించగా 1710 మంది ఉండాలని, 70 మంది వద్దని తీర్పు ఇచ్చారు. అప్పట్లో ఆలగపడ గ్రామాన్ని జాతీయ మీడియా వెతుక్కుంటూ వచ్చింది. ఈ విజయం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో కూడా స్థానం దక్కించుకుంది. 2005లో పాండురంగారావు జాతీయ స్థాయిలో ఉత్తమ సర్పంచ్‌గా ఎంపికై కేంద్రం నుంచి అవార్డు అందుకున్నారు. అవినీతి రహిత పాలనపై దక్షిణాది రాష్ట్రాల తరఫున ఓ స్వచ్ఛంద సంస్థ బెస్ట్ సర్పంచ్ అవార్డుకు ఆయనను ఎంపిక చేసింది. పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన మళ్లీ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు.
దేశంలోనే మొట్టమొదటగా
ఆలగడప గ్రామంలో..
‘సాక్షి’తో వేనేపల్లి పాండురంగారావు
మా గ్రామంలో సేవా కార్యక్రమాలను చేస్తున్న సమయంలో ప్రజలు నన్ను సర్పంచ్‌గా పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. 2001లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి 1400 ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. రెండు సంవత్సరాలు పదవిలో కొనసాగాక.. పదవిపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు రెఫరెండెం పెట్టాను. దానిలో 90శాతం మంది ప్రజలు పదవిలో ఉండాలని, పాలన బాగుందని తీర్పు ఇచ్చారు. ఈ రెఫరెండెం దేశ చరిత్రలో మొదటిసారి కావడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
రెఫరెండం
రెఫరెండం


