నేడు మొదటి విడత ‘పంచాయతీ’కి నోటిఫికేషన్
మొదటి విడత జరిగే మండలాలు..
మండలం పంచాయతీలు వార్డులు
చిట్యాల 18 180
కనగల్ 31 262
కట్టంగూర్ 22 206
కేతేపల్లి 16 160
నకిరేకల్ 17 160
నల్లగొండ 31 270
నార్కట్‌పల్లి 29 262
శాలిగౌరారం 24 230
తిప్పర్తి 26 216
చండూరు 19 166
గట్టుప్పల్ 7 68
మర్రిగూడ 18 170
మునుగోడు 28 294
నాంపల్లి 32 276
మొత్తం 318 2,870
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. మొదటి విడత జరగనున్న పంచాయతీ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. దీనిలో భాగంగా కలెక్టర్ నేతృత్వంలో బుధవారం ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీలకు శిక్షణ పూర్తి చేశారు. నాలుగైదు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. క్లస్టర్ గ్రామాల్లో గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 14 మండలాల్లోని 318 గ్రామ పంచాయతీల్లో డిసెంబర్ 11వ తేదీన పోలింగ్ జరుగనుంది. తొలివిడతకు సంబంధించిన నామిషనేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమై శనివారంతో ముగియనుంది. నామినేషన్ల స్వీకరణకు అవసరమయ్యే ఎన్నికల సామగ్రిని నల్లగొండలోని ప్రభుత్వ ఆసుపత్రి గోదాముల్లో నుంచి ఆయా మండలాలు, క్లస్టర్లకు తరలించారు.
117 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ
నల్లగొండ, చండూరు డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు 117 క్లస్టర్లను గుర్తించారు. ప్రతి మూడు నాలుగు గ్రామాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. వారి గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీ చేయాలనుకునే వారు ఆ క్లస్టర్‌లోనే నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. క్లస్టర్‌లో రిటర్నింగ్ ఆఫీసర్‌తోపాటు(ఆర్‌ఓ) అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను (ఏఆర్‌ఓ) నియమించారు. వారికి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు.
రెండు డివిజన్లు, 318 గ్రామాల్లో ఎన్నికలు
నల్లగొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లో మొదటి విడత డిసెంబర్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ 14 మండలాల్లోని 318 గ్రామ పంచాయతీలు, 2,870 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు 2,870 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మౌలిక వసతుల కల్పన కూడా పూర్తి చేశారు.
ఫ తొలివిడతలో 318 సర్పంచ్, 2,870 వార్డులకు ఎన్నికలు
ఫ నామినేషన్ల స్వీకరణకు
14 మండలాల్లోని 117 క్లస్టర్ల ఏర్పాటు
నేడు మొదటి విడత ‘పంచాయతీ’కి నోటిఫికేషన్
నేడు మొదటి విడత ‘పంచాయతీ’కి నోటిఫికేషన్


