బంగారిగడ్డలో పత్తి రైతుల ఆందోళన
చండూరు : పత్తి మిల్లులో దళారులు తెచ్చిన పత్తే కొంటున్నారని ఆరోపిస్తూ బుధవారం బంగారిగడ్డ గ్రామంలో మంజీత్ పత్తి మిల్లు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. దళారులు రైతుల పాస్‌బుక్‌ల ద్వారా ఎక్కువ స్లాట్‌లు బుక్ చేసుకుని అమ్ముతున్నారని, రైతులు తీసుకువస్తే పత్తి బాగాలేదని, పత్తి కాయ వచ్చిందని, నల్లగా మారిందని కుంటిసాకులు చెబుతూ తిప్పి పంపుతున్నారని వాపోయారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ శ్రీదేవి పత్తి మిల్లు వద్దకు వచ్చి రైతులతో మాట్లాడారు. రైతుల పత్తిని కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించడంతో వివాదం సద్దుమనిగింది.


