ఏఎస్పీ మౌనికకు ఆత్మీయ వీడ్కోలు
కొండమల్లేపల్లి : దేవరకొండ ఏఎస్పీగా విధులు నిర్వహించి ఇటీవల అదిలాబాద్ అడిషనల్ ఎస్పీగా బదిలీపై వెళ్లిన పి.మౌనికకు దేవరకొండ సబ్‌డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు పలికారు. కొండమల్లేపల్లిలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఈ సమావేశానికి అడిషనల్ ఎస్పీ రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీడ్కోలు పొందిన ఏఎస్పీ మౌనిక మాట్లాడుతూ ఈ డివిజన్‌లో 11 నెలలు పనిచేయడం మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందన్నారు. సిబ్బంది సహకారంతో పలు కేసులను చేధించామన్నారు. అనంతరం ఆమెను సిబ్బంది ఘనంగా సన్మానించారు. దేవరకొండ నూతన డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాసరావుకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో సీఐలు బీసన్న, వెంకట్‌రెడ్డి, రాజు, ఎస్‌ఐలు అజ్మీరా రమేష్, రామ్మూర్తి, నర్సింహ, బాలకృష్ణ, సాలకమ్మ తదితరులు పాల్గొన్నారు.


