కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
నల్లగొండ టౌన్ : కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాడాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నల్లగొండలోని సుభాష్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 65 లక్షల పోస్టులను భర్తీ చేయాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, చినపాక లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, బొజ్జ చిన్నవెంకులు, కందాల ప్రమీల, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, డబ్బీకార్ మల్లేష్, ఎండీ.సలీం, డి.సత్తయ్య, అవుట రవీందర్ పాల్గొన్నారు.
ఆరోగ్య ఉపకేంద్రం తనిఖీ
చిట్యాల : మండలంలోని గుండ్రాంపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ సెంటర్‌లో రికార్డులు, మందుల స్టాక్‌ను పరిశీలించారు. గ్రామస్తులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, వెలిమినేడు వైద్యాధికారి ఉబ్బు నర్సింహ, ఏఎన్‌ఎం హేమలత, మల్లీశ్వరి ఉన్నారు.
ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థుల ఆందోళన
నల్లగొండ టౌన్ : లాబ్ టెక్నీషియన్స్ గ్రేడ్–2 అభ్యర్థుల కౌన్సిలింగ్ ఆర్డర్ కాపీని ఈ నెల 24న విడుదల చేసి స్థానిక ఎన్నికల పేరుతో కౌన్సిలింగ్ వాయిదా వేయడాన్ని నిరసిస్తూ నల్లగొండలో బుధవారం ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించి న్యాయం చేయాలని కోరారు.
అంగన్‌వాడీలు సమయపాలన పాటించాలి
మిర్యాలగూడ టౌన్ : అంగన్‌వాడీలు సమయపాలనను పాటించాలని జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి అన్నారు. బుధవారం మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో గల రైతు వేదికలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలన్నారు. బ్రూణ హత్యలు, శిశు విక్రయాలు, బాల్య వివాహాలు ఉంటే వెంటనే పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. బాల్య వివాహాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. వన్ టౌన్ ఎస్‌ఐ సైదిరెడ్డి, సీడీపీఓ రేఖల మమత, సూపర్‌వైజర్లు రాధిక, నజిమాబేగం, మోహ్మద్, వాణి, నిహారిక, లీలాకుమారి, హేమాదేవి, నాగమణి, రమణి, అశ్రిత, శోభ, కవిత తదితరులు పాల్గొన్నారు.
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలి


