ప్రజలు మద్దతుగా నిలిచారు
ప్రజల అవసరాలకు అనుగుణంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలి. అప్పుడే సమస్యలన్నీ పరిష్కరమవుతాయి. అందుకుగాను నేను ఎంపీటీసీగా పని చేస్తున్న క్రమంలో ప్రజల ఆలోచనల మేరకు పనిచేస్తున్నానా.. లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు రెఫరెండం నిర్వహించుకున్నాను. 95 శాతం మంది నాకు మద్దతుగా నిలవడం సంతృప్తినిచ్చింది.
– దుబ్బాక నర్సింహారెడ్డి, నేరడ,
చిట్యాల మండలం
చిట్యాల : మండలం నేరడ గ్రామానికి చెందిన దుబ్బాక నర్సింహారెడ్డి. దుబ్బాక నర్సింహారెడ్డి 1999లో స్వగ్రామం నేరడ ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి.. 200 ఓట్ల అత్యధికంతో గెలిచారు. గ్రామాభివృద్ధికిగాను శక్తివంచన లేకుండా పనిచేశారు. ఎంపీటీసీగా ఆయన పనితీరుపై మూడేళ్ల పదవీకాలం తర్వాత 2002లో స్వచ్ఛందంగా రెఫరెండం నిర్వహించుకున్నారు. మొత్తం 1600 మంది ఓటింగ్‌లో పాల్గొనగా.. 1510 మంది దుబ్బాక పాలనను మెచ్చుకున్నారు. 90 మంది మాత్రమే వ్యతిరేకించారు. అప్పట్లో ఓ పోటీ పరీక్షలో పార్టీ గుర్తుపై గెలిచి రెఫరెండం నిర్వహించుకున్న ప్రజాప్రతినిధి ఎవరని.. ప్రశ్న వచ్చింది.


