1964లో తొలిసారి పంచాయతీ ఎన్నికలు
నామినేషన్ల తిరస్కరణకు కారణాలివే..
పోటీకి వీరు అనర్హులు
కోదాడ : ప్రజాస్వామ్య వ్యవస్థలో మూలస్తంభమైన గ్రామపంచాయతీల ఏర్పాటు, కాలానుగుణంగా చోటు చేసుకున్న మార్పులు ఆసక్తిగా ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత పంచాయతీ రాజ్ సంస్థల ఏర్పాటు కోసం 1957లో భారత ప్రభుత్వం బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించింది. ఈ కమిటీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మూడంచెల (గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్) వ్యవస్థలను ఏర్పాటు చేయాలని చేసిన సూచనలను జాతీయాభివృద్ధి సంస్థ 1958లో ఆమోదించింది. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీ రాజ్ సంస్థల చట్టం ఏర్పాటు చేసింది. దీన్ని మొట్టమొదటగా రాజస్థాన్ రాష్ట్రం అమలు చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనిని 1959 అక్టోబర్2న అమలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1964లో సమగ్ర గ్రామ పంచాయతీల చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం 500 పైగా జనాభా ఉన్న గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేశారు. జనాభాను బట్టి 5 నుంచి 17 మంది వరకు వార్డు సభ్యులుండవచ్చని దీనిలో పేర్కొన్నారు. 1964లో సర్పంచ్‌ల ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. వార్డు సభ్యులను ఓటర్లు ఎన్నుకుంటే, ఈ వార్డు సభ్యులు సర్పంచ్‌ను ఎన్నుకునేవారు. ఎన్నికై న సర్పంచ్‌లు కలిసి సమితి ప్రెసిడెంట్‌ను ఎన్నుకునేవారు. సమితి ప్రెసిడెంట్‌లు జిల్లా పరిషత్ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకునేవారు. 1976 వరకు ఇదే పద్ధతి కొనసాగింది. వీరి ఎన్నికలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండేది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1978లో నరసింహం కమిటీని ఏర్పాటు చేసింది. సర్పంచ్‌లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని ఈ కమిటీ సూచించింది. దీంతో అప్పటి నుంచి సర్పంచ్‌ల ఎన్నిక ప్రక్రియ ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహిస్తూ వస్తున్నారు.
1992లో అమల్లోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి వారి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే 1/3 వ వంతు మహిళలకు రిజర్వు చేయాలని సూచించింది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లలో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1986 ఫిబ్రవరి 15న అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు తాలూకాలను రద్దు చేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు. మండలాలకు 1987లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. మండల పరిషత్ అధ్యక్షుడిని నేరుగా ఎన్నుకున్నారు. దీనిలో సభ్యులుగా ఆయా మండలాల పరిధిలోని సర్పంచ్‌లు ఉండేవారు. ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎన్నుకునేవారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం –1994 ద్వారా అదే సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అనే మూడంచెల వ్యవస్థను ఆమోదించింది. మండల పరిషత్‌లో సర్పంచ్‌లను సభ్యులుగా తొలగించి వారి స్థానంలో ఎంపీటీసీలను, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో ఎంపీపీలను సభ్యులుగా తొలగించి జెడ్పీటీసీలను సభ్యులుగా చేర్చారు. మెజార్టీ ఎంపీటీసీలు ఎంపీపీని, మెజార్టీ జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకోవడం ప్రారంభమైంది.
ఫ పోటీ చేసే అభ్యర్థుల పేరు ఓటరు లిస్టులో లేకున్నా, వయస్సు సరిగ్గా లేకపోయినా నామినేషన్‌ను తిరస్కరిస్తారు.
ఫ నామినేషన్ వేసే అభ్యర్థుల సంతకాలు, ప్రతిపాదకుని సంతకాలు లేకున్నా, గత ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చుల వివరాలు 45 రోజుల్లోగా ఇవ్వని అభ్యర్థుల నామినేషన్‌ను అధికారులు తిరస్కరిస్తారు.
ఫ గ్రామ సేవకులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు.
ఫ గ్రామ పంచాయతీకి వ్యక్తిగతంగా బకాయిపడిన వారు. బకాయిలపై నోటీసులు ఇచ్చినా స్పందించని వారు.
ఫ మతిస్థిమితం లేనివారు, బధిరులు.
ఫ పౌరహక్కుల పరిరక్షణచట్టం–1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడినవారు.
ఫ గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేస్తున్నా, నిర్వహణకు ఒప్పందం చేసుకున్న వారు కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు.
1964లో తొలిసారి పంచాయతీ ఎన్నికలు
1964లో తొలిసారి పంచాయతీ ఎన్నికలు


