పెద్దఅడిశర్లపల్లి : గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలం ఘనపురంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘనపురం గ్రామ శివారులో జడ్చర్ల–నాగార్జునసాగర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని మహిళ(50) నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దాంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


