బైక్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు
మునగాల : బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన బుధవారం రాత్రి మునగాల శివారులో చోటు చేసుకుంది. పెన్‌పహాడ్ మండలం చీదెళ్ల గ్రామానికి చెందిన కొండమీది వెంకన్న బైక్‌పై కోదాడకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా మునగాల శివారులోని కొక్కిరేణి వెళ్లే రోడ్డుపై రైతులు ఽఆరబోసిన ధాన్యం గమనించకుండా బైక్‌ను వెళ్లనీయడంతో అదుపుతప్పి కింద పడిపోయాడు. వెంకన్నకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రద్దీగా ఉండే రోడ్లపై కూడా ధాన్యం ఆరబోయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.


