మాజీ సైనికుల పిల్లలకు ఉపకార వేతనాలు
నల్లగొండ టూటౌన్ : మాజీ సైనికులు, అమరులైన సైనికుల పిల్లలు వృత్తి విద్యా కోర్సులు చదువుతుంటే వారికి కేంద్ర రక్షణ శాఖ ఉపకార వేతనాలు అందిస్తోందని నల్లగొండ రీజియన్ ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఇంజనీరింగ్, మెడిసిన్, డెంటల్, ఎంబీబీఎస్, బీ ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ చదువుతూ ఉండి ఇంటర్‌లో 60 శాతం మార్కులు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. బాలురకు నెలకు రూ. 2500, బాలికలకు రూ.3వేల చొప్పున అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన సైనిక కుటుంబాలకు చెందిన వారు డిసెంబర్ 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు www.kr b.gov.in ను గానీ, లేదా జిల్లా సైనిక సంక్షేమ అధికారిని, ఫోన్ 08682–224820 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.
జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
నేరేడుచర్ల : జాతీయ స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు నేరేడుచర్లకు చెందిన వరాల వరుణ్‌కుమార్ ఎంపికయ్యాడు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన క్యాంపస్ సెలక్షన్స్‌లో అతను పాల్గొని ప్రతిభ కనబర్చడంతో అధికారులు వరుణ్‌కుమార్‌ను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. ఈ నెల 27 నుంచి 30 వరకు హర్యానాలో జరుగనున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో వరుణ్ తెలంగాణ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. జాతీయ స్థాయికి ఎంపికై న వరుణ్‌ను కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అల్లం ప్రభాకర్‌రెడ్డి, నామ నర్సింహారావు, అసోసియేషన్ మండలాధ్యక్షుడు నూకల సందీప్‌రెడ్డి, కార్యదర్శి సైదులు అభినందించారు.
మహిళ అవయవాలు దానం
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన మహిళ బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. రామాజీపేట గ్రామానికి చెందిన కల్లెపల్లి ఐలయ్య భార్య ఉపేంద్ర (43)తో కలిసి ఈ నెల 11న బైక్‌పై ఆలేరు నుంచి రామాజీపేట గ్రామానికి వస్తుండగా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న కల్లెపల్లి ఉపేంద్ర మంగళవారం బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జీవన్‌దాన్ ఫౌండేషన్ సిబ్బంది ఆస్పత్రికి చేరుకొని అవయవదానంపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. అవయవ దానానికి ఆమె భర్త కల్లెపల్లి ఐలయ్య అంగీకరించడంతో ఉపేంద్ర కాలేయం, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులను సేకరించారు.
‘డ్రాగెన్ బోట్’లో
ఉత్తమ ప్రతిభ
రాజాపేట : జాతీయస్థాయి డ్రాగెన్ బోట్ చాంపియన్ షిప్ పోటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పుట్టగూడేనికి చెందిన ఎం.రేవంత్ ప్రతిభ కనబర్చాడు. మహారాష్టలోని నాందెండ్‌లో ఈ నెల 24 నుంచి జరుగుతున్న జాతీయస్థాయి డ్రాగెన్ బోట్ చాంపియన్‌షిప్ పోటీల్లో రేవంత్ తెలంగాణ తరఫున పాల్గొంటున్నాడు. బుధవారం నిర్వహించిన సీనియర్ మెన్ వెయ్యి మీటర్ల పోటీల్లో రేవంత్ సిల్వర్ మెడల్, 500 మీటర్లు, సీనియర్ మిక్స్‌డ్ వెయ్యి, 500 మీటర్ల విభాగాల్లో కాంస్య పతకాలు సాధించాడు.
మాజీ సైనికుల పిల్లలకు ఉపకార వేతనాలు
మాజీ సైనికుల పిల్లలకు ఉపకార వేతనాలు


