గిడ్డంగుల్లో ధాన్యం నిల్వ చేసుకోవాలి
ఫ జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ జేడీ మరియదాస్
గరిడేపల్లి : గిడ్డంగుల్లో ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం ద్వారా రైతులకు అధిక ప్రయోజనాలు సమకూరుతాయని జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ జాయింట్ డైరెక్టర్ ఎ.మరియదాస్ అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లిలో ‘వేర్ హౌసింగ్ డెవలప్‌మెంట్, నెగోషియబుల్ వేర్ హౌస్’పై బుధవారం రైతులు, వ్యాపారులు, పప్పు మిల్లు యజమానులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పొలంలో ఎలుకల యాజమాన్యంపై వివరించారు. రైతులు ధాన్యం నిల్వ చేసుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆహార ధాన్యాలు వృథా కాకుండా కాపాడుకోవచ్చన్నారు. లేదంటే చీడ పురుగులు, ఎలుకల వల్ల 10 నుంచి 30శాతం వరకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ధాన్యం నిల్వ చేసే సమయంలో ఉపయోగించే హెర్మటిక్ బ్యాగ్‌ల ఉపయోగాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త డి.ఆదర్శ, కిరణ్, అక్షిత్‌సాయి, ఎన్. సుగంధి, రైతులు పాల్గొన్నారు.


