రాజేశ్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి
కోదాడరూరల్ : దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతికి కారకులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిమాండ్ ఖైదీగా ఉండి ఇటీవల మృతి కోదాడకు చెందిన కర్ల రాజేశ్ కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. రాజేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాజేశ్‌ను అదుపులోకి తీసుకొని నాలుగురోజుల పాటు చిలుకూరు, రూరల్ పోలీస్‌స్టేషన్లకు తిప్పి చిత్రహింసలు పెట్టడంతోనే మృతి చెందాడన్నారు. అమాయక దళితులను చంపి డబ్బు ఆశ చూపడం ద్వారా నిందితులు చట్టం నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. రాజేశ్ కేసు విషయంలో జరిగిన పరి ణామాలు చూస్తుంటే దళితుల మాన ప్రాణాలకు విలువ లేదనే విషయం స్పష్టమవుతుందన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఏకమై కేసును నీరు గారుస్తు న్నారని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటే తమకు గౌరవం ఉందని, ఆయన సతీమణి ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి నిందితులను కాపాడే ప్రయత్నం చేయడం బాధకరమని అన్నారు. రాజేశ్ మృతిపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్‌మాదిగ, నాయకులు బచ్చలకూరి వెంకటేశ్వర్లు, ఏపూరి రాజుమాదిగ, యలమర్తి రాము, ఆంజనేయులు, కోటేశ్, బోడ సునీల్, రాజన్న, చింత వినయ్‌బాబు ఉన్నారు.
ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక
అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ


