ఆస్పత్రిని త్వరితగతిన ప్రారంభించాలి
నకిరేకల్ : బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నకిరేకల్‌కు మంజూరు చేసిన 100 పడకల ఆస్పత్రిని పూర్తిచేసి త్వరితగతిన ప్రారంభించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వాన్ని కోరారు. నకిరేకల్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆస్పత్రి భవన సముదాయాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 జనవరి 22న రూ.32 కోట్లతో ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభించి 80 శాతం మేర పూర్తిచేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మిగిలిన పనులు పూర్తిచేయించడంలో జాప్యం చేస్తోందన్నారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఆస్పత్రి నిర్మాణంలో రెండేళ్లుగా జాప్యం జరుగుతోందన్నారు. అప్పట్లో వైద్యశాల నిర్వహణ, 69 మంది సిబ్బంది వేతనాల కోసం ప్రతి ఏటా రూ.6.35 కోట్లు మంజూరు చేయించామని గుర్తుచేశారు. వైద్యశాల సముదాయాన్ని త్వరితగతిన పూర్తిచేసి పేద ప్రజల అందుబాటులో తేవాలని కోరారు. ఆయన వెంట నకిరేకల్ మార్కెట్, మున్సిపల్ మాజీ చైర్మన్లు కొప్పుల ప్రదీప్‌రెడ్డి, రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, నాయకులు రాచకొండ వెంకన్నగౌడ్, గుర్రం గణేశ్, దైద పరమేషం, నోముల కేశవరాజులు, రాచకొండ శ్రవణ్, యానాల లింగారెడ్డి, పల్లె విజయ్, రావిరాల మల్లయ్య, పేర్ల కృష్ణకాంత్ తదితరులు ఉన్నారు.
కేసీఆర్‌కు పేరు వస్తుందనే పనుల్లో జాప్యం జరుగుతోంది
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య


