869 పల్లెల్లో పోరు
న్యూస్‌రీల్
గ్రామ పంచాయతీలు,
ఓటర్ల వివరాలు ఇలా..
మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు
బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పల్లె పోరుకు నగారా మోగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. జిల్లాలోని 33 మండలాల్లో 869 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబరు 11న మొదటి విడతలో నల్లగొండ చండూరు రెవెన్యూ డివిజన్లలో, 14న రెండో విడతలో మిర్యాలగూడ, 17న మూడు విడతలో దేవరకొండ డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.
మొదటి విడతలో 318 పంచాయతీలు
డిసెంబరు 11న జరిగే మొదటి విడతలో నల్లగొండ, చండూరు డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. చిట్యాల, కనగల్, కట్టంగూర్, కేతేపల్లి, నకిరేకల్, నల్లగొండ, నార్కట్‌పల్లి, శాలిగౌరారం, తిప్పర్తి, చండూరు, గట్టుప్పల్, మర్రిగూడ, మునుగోడు, నాంపల్లి మండలాల పరిధిలో 318 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27న గ్రామాలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. అదే రోజున నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 29వ తేదీన ముగుస్తుంది. 30వ తేదీన పరిశీలన, డిసెంబర్ 1వ తేదీన అప్పీల్‌కు అవకాశమిచ్చి.. మరుసటి రోజు వాటిని పరిశీలిస్తారు. 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, 3 గంటలకు పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది.
రెండో విడతలో 282 పంచాయతీలు
డిసెంబరు 14వ తేదీన జరిగే రెండో విడతలో మిర్యాలగూడ మిర్యాలగూడ డివిజన్‌లోని గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అడవిదేవులపల్లి, అనుముల, దామరచర్ల, మాడ్గులపల్లి, మిర్యాలగూడ, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరిసాగర్, త్రిపురారం, వేములపల్లి మండలాల పరిధిలో 282 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత ఎన్నికలకు ఈ నెల 30వ తేదీన గ్రామాలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటన చేయడంతో పాటు అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబర్ 2వ తేదీన నామినేషన్ల గడువు పూర్తవుతుంది. 3వ తేదీన నామినేషన్ల పరిశీలన, అదే రోజు చెల్లిన నామినేషన్లను ప్రకటించి డిసెంబర్ 4న అప్పీల్‌కు అవకాశమిచ్చి మరుసటి రోజు వాటిని పరిశీలిస్తారు. డిసెంబరు 6న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, 3 గంటల తర్వాత రంగంలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. డిసెంబర్ 14వ తేదీన పోలింగ్ జరగనుంది.
మూడో విడతలో 269 పంచాయతీలు
డిసెంబరు 17న జరుగనున్న మూడో విడతలో దేవరకొండ డివిజన్ పరిధిలో ఎన్నికలు జరుగనున్నాయి. చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుడిపల్లి, గుండ్లపల్లి(డిండి), గుర్రంపోడు, కొండమల్లేపల్లి, నేరడుగొమ్ము, పీఏపల్లి మండలాల పరిధిలో 269 గ్రామ పంచాయతీలకు ఎన్నికల జరగనున్నాయి. డిసెంబరు 3వ తేదీన ఓటరు జాబితా ప్రకటిస్తారు. అదే రోజున నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై 5వ తేదీన ముగుస్తుంది. 6వ తేదీన నామినేషన్ల పరిశీలన, అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత చెల్లిన నామినేషన్ల జాబితా ప్రకటిస్తారు. 7వ తేదీన అప్పీల్‌కు అవకాశం ఇస్తారు. 8వ తేదీన పరిశీలించి, 9వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, ఆ తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 17వ తేదీన పోలింగ్ జరగనుంది.
పంచాయతీలు 869
వార్డులు 7,494
మొత్తం ఓటర్లు 10,73,506
పురుషులు 5,30,860
మహిళలు 5,42,589
ట్రాన్స్‌జెండర్లు 57
పోలింగ్ స్టేషన్లు 7,494
ఫ డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్
ఫ నల్లగొండ, చండూరు
డివిజన్లలో మొదటి విడత
ఫ రెండో విడతలో మిర్యాలగూడ, మూడో విడతలో దేవరకొండ డివిజన్లలో ఎన్నికలు
ఫ ఎన్నికలకు సిద్ధంగా యంత్రాంగం
పంచాయతీ ఎన్నికల వివరాలు ఇలా..
డివిజన్ మండలాలు పంచాయతీలు వార్డులు పోలింగ్ తేదీ
నల్లగొండ, చండూరు 14 318 2,870 డిసెంబర్ 11న
మిర్యాలగూడ 10 282 2,418 డిసెంబర్ 14న
దేవరకొండ 09 269 2,206 డిసెంబర్ 17న
869 పల్లెల్లో పోరు


