బీసీలను వంచిస్తున్న ప్రభుత్వాలు
నల్లగొండ టౌన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్ కల్పించుకుండా బీసీలను వంచిస్తున్నాయని బీసీ జేఏసీ చైర్మన్ చక్రహరి రామరాజు విమర్శించారు. జీఓ 46కు వ్యతిరేకంగా నల్లగొండలోని గడియారం సెంటర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దహనం చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని పెట్రోల్‌ను, దిష్టిబొమ్మలను తీసుకెళ్లడంతో జీఓ నంబర్ 46 ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. బీసీల న్యాయమైన డిమాండ్లను తీర్చే వరకు పోరాటం ఆగదన్నారు. కార్యక్రమంలో కేశబోయిన శంకర్, చొల్లేటి ప్రభాకర్, కాసోజు విశ్వనాథం, నల్లా సోమమల్లయ్య, నకిరెకంటి కాశయ్యగౌడ్, కంది సూర్యనారాయణ, చొల్లేటి రమేష్, సాయిబాబా, మధు, గోవర్ధన్, ఆది నారాయణ, భిక్షమయ్య, సర్వయ్య, మల్లయ్య, సుధాకర్, తరుణ్, ప్రవీణ్, రవి పాల్గొన్నారు.
పశువైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
మాడుగులపల్లి : పశువైద్య శిబిరాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి రాష్ట్ర రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వికె.శర్మ, జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ జూలకంటి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం మాడుగులపల్లి మండలంలోని చెరువుపల్లి గ్రామంలో ప్రత్యేక పశువైద్య శిబిరం నిర్వహించారు. 50 పశువులకు గర్భకోశ పరీక్షలు, పలు పశువులకు చూడి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా వారు పాడి రైతులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి వినయ్‌కుమార్, పశువైద్యులు రాంరెడ్డి, యశ్వంత్, సందీప్‌కుమార్, అశోక్, శ్రీకాంత్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, నాగేంద్ర, శ్రవణ్, సాయిరాం, స్వామినాయక్, సంతోష్, తులసీ, పరుశురామ్, సిబ్బంది శ్రీలత, జయమ్మ, రాకేష్, గోపాలమిత్రలు రవి, సూపర్‌వైజర్ శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.
క్షేత్రపాలకుడికి
నాగవళ్లి దళార్చన
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న ఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సింధూరం పాటు పాలతో అభిషేకించారు. అనంతరం నాగవల్లి దళార్చన చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఇక శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు నిర్వహించారు.
దర్వేశిపురంలో
బహిరంగ వేలం
కనగల్ : మండలంలోని దర్వేశిపురం (పర్వతగిరి) శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం వద్ద ఏడాది కాలానికి వివిధ వస్తు విక్రయ హక్కులను కల్పించేందుకు మంగళవారం టెండర్ కం బహిరంగ వేలాన్ని నిర్వహించారు. లడ్డు, పులిహోర విక్రయ హక్కులను దామరచర్లకు చెందిన డి.నెహ్రూ రూ 14,14,141కు దక్కించుకున్నారు. గాజుల అమ్మకం హక్కులను నల్లగొండ పట్టణానికి చెందిన పి.రవికుమార్ రూ.9లక్షల 65 వేలకు, దేవస్థానం ఫంక్షన్ హాల్ నిర్వహణను దర్వేశిపురం గ్రామానికి చెందిన సత్తయ్య రూ.లక్షకు వేలంపాడి హక్కులను దక్కించుకున్నారు. కాగా కిరాణం, బొమ్మలషాపు, ఫొటోలు తీసేందుకు సరైన వేలం రానందున వాయిదా వేశారు. కార్యక్రమంలో ఎండోమెంట్ పరిశీలనాధికారి పి.ఏడుకొండల్, ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్‌రెడ్డి, కార్యనిర్వాణాధికారి అంబటి నాగిరెడ్డి, ధర్మకర్తలు శంకర్ రెడ్డి, ప్రభాకర్, బాబు, సైదులు, రమేష్, దుర్గమ్మ, సీనియర్ అసిస్టెంట్లు చంద్రయ్య, నాగేశ్వర్‌రావు, జూనియర్ అసిస్టెంట్ నాగరాజు, చనగోని శ్రీకర్‌గౌడ్, నాగరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.


