మహిళా సాధికారతతోనే అభివృద్ధి
మిర్యాలగూడ : మహిళా సాధికారతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం స్థానిక కళాభారతిలో మిర్యాలగూడ నియోజకవర్గంలో 3,689 స్వయం సహాయక సంఘాలకు రూ.10.11 కోట్ల వడ్డీలేని రుణాల చెక్కులను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్, సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్‌తో కలిసి ఆమె అందజేసి మాట్లాడారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో మహిళలకు ప్రభుత్వాలు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాయన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ అభివృద్ధి పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం సంక్షమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అంతకుముందు పట్టణంలోని నైట్ షెల్టర్‌ను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని గూడూరులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంట్లో గృహ ప్రవేశం చేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ సురేష్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సెర్ప్, మెప్మా అధికారులు బక్కయ్య, దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


