నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి
మిర్యాలగూడ : రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) శ్రవణ్‌కుమార్ అన్నారు. మంగళవారం మిర్యాలగూడలోని పలు విత్తనాల దుకాణాలు, ఫర్టిలైజర్స్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి మాట్లాడారు. డీలర్లు రైతులకు నాసిరకం విత్తనాలు, పురుగులు మందులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లాలో చలి తీవ్రంగా ఉన్నందున రైతులు విత్తనాలు నాటే కార్యక్రమాన్ని ఒక వారం రోజుల పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏడీఏ సైదానాయక్, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.


