రుణాలు పంపిణీ చేస్తాం
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ : జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సోమవారం ఆమె హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు 3.66 లక్షల ఇందిరా మహిళా శక్తి చీరలు వచ్చాయని.. 3 లక్షల పంపిణీ చేసామని తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమాన్ని సవ్యంగా నిర్వహిస్తామన్నారు. సమావేశంలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, గృహ నిర్మాణ పీడీ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.


