క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాం
నల్లగొండ టూటౌన్ : కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ రాష్ట్రస్థాయి చెస్ పోటీల పోస్టర్‌ను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ మారం గోనారెడ్డి, కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 20న ప్రతీక్ వర్ధంతి సందర్భంగా నల్లగొండ జిల్లా చెస్ అసోసియేషన్, ప్రతీక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 20, 21 తేదీల్లో చెస్ పోటీలు నిర్వహిస్తామన్నారు. విజేతలకు రూ.50,000 నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు.వివరాలకు 99854 23823 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.


