వైభవంగా గంధం ఊరేగింపు
అర్వపల్లి: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన అర్వపల్లి శివారులో ఉన్న హజ్రత్ సయ్యద్ ఖాజ నసీరుద్దీన్ బాబా దర్గా ఉర్సు శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. రాత్రి అర్వపల్లి పోలీస్‌స్టేషన్ నుంచి గంధం ఊరేగింపు నిర్వహించారు. వక్ఫ్‌బోర్డు రాష్ట్ర అసిస్టెంట్ కార్యదర్శి అమీర్‌హైమద్, నాగారం, తుంగతుర్తి సీఐలు నాగేశ్వరరావు, నర్సింహారావు, కాంగ్రెస్ నాయకుడు గుడిపల్లి మధుకర్‌రెడ్డి, వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే.మహమూద్, మహ్మద్ హుస్సేన్, స్థానిక ఎస్‌ఐ ఈట సైదులు, ముజావర్ అలీలు గంధం పాత్రలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా వై జంక్షన్ వరకు వచ్చారు. ఊరేగింపునకు ముందు ఫకీర్లు జరబ్ నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా బాణాసంచా కాల్చారు. తొలిరోజు ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉర్సు సందర్భంగా దర్గా వద్ద విధ రకాల దుకాణాలు వెలిశాయి. ఈ వేడుకల్లో మాజీ సర్పంచ్ పాలెల్లి సురేష్, సాయిని మనోహర్, వివిధ పార్టీల నాయకులు, ముస్లింలు పాల్గొన్నారు.
పోలీస్ బందోబస్తు ఏర్పాటు
ఉర్సు సందర్భంగా సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ పర్యవేక్షణలో నాగారం సీఐ నాగేశ్వరరావు, స్థానిక ఎస్‌ఐ ఈట సైదులు ఆధ్వర్యంలో డివిజన్‌న్‌పరిధిలోని ఎస్‌ఐలు, 100మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్గా వద్ద రిటైర్డు ఎస్‌ఐ అబ్ధుల్ హమీద్ కుమారుడు మహ్మద్ హుస్సేన్ 2,500 మంది భక్తులకు అన్నదానం చేశారు.
అర్వపల్లి దర్గా ఉర్సు ప్రారంభం
వేలాదిగా తరలివచ్చిన భక్తులు


