స్మార్ట్‌గా ఆలోచిస్తే..
ఏఐ రంగంలో విద్యార్థులు, యువత నుంచి నూతన ఆవిష్కరణలను స్వాగతించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది.
- 10లో
వ్యాధులపై అప్రమత్తత అవసరం
పెద్దఅడిశర్లపల్లి : సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం గుడిపల్లి మండల కేంద్రంలో పీహెచ్‌సీని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి టైపాయిడ్, మలేరియా, కుక్క కాటు గురించి అడిగి తెలుసుకున్నాడు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కేశ రవి, వైద్యాధికారి ప్రియాంక ఉన్నారు.


