ఆండాళ్ దేవికి ఊంజల్ సేవ
యాదగిరిగుట్ట: యాదగిరీశుడి సన్నిధిలో జరిగే నిత్యారాధనల్లో భాగంగా శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం నేత్రపర్వంగా జరిపించారు. అమ్మవారిని సుందరంగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవ నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన నాధస్వరాన్ని వినిపించారు. ఇక ప్రధానాలయంలో వేకువజామున సుప్రభాతం, గర్భాలయంలోని స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చన, ప్రాకారమండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, స్వామి, అమ్మవారికి నిత్య తిరుకల్యాణం, బ్రహ్మోత్సం తదితర పూజలు నిర్వహించారు.
దేవరకొండ ఏఎస్పీ మౌనిక బదిలీ
దేవరకొండ : దేవరకొండ ఏఎస్పీ పి.మౌనిక బదిలీ అయ్యారు. ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీగా బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. దేవరకొండ ఏఎస్పీగా ఆమె దాదాపు 11 నెలల పాటు విధులు నిర్వహించారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
మర్రిగూడ : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీసీహెచ్‌ఎస్ మాతృనాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని 30 పడకల ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించి రికార్డులను, ఫార్మా సెంటర్, ఎక్స్‌రే, డయాలసిస్ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆసుపత్రికి అవసరమైన రెండు ఆక్సిమీటర్లు, నాలుగు వీల్‌చైర్లను త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శంకర్‌నాయక్, మెడికల్ ఆఫీసర్ శాలిని, సిబ్బంది పాల్గొన్నారు.
‘హ్యాండ్లూమ్ టెక్నాలజీ’లో పుట్టపాక చేనేత స్టాల్
సంస్థాన్ నారాయణపురం: హైదారాబాద్‌లోని శ్రీ కొండాలక్ష్మణ్ బాపూజీ హ్యండ్లూమ్ టెక్నాలజీ లాబోరేటరీ ప్రారంభోత్సవం సందర్భంగా సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన చేనేత కళాకారులు చేనేత స్టాల్ ఏర్పాటు చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చేనేత స్టాల్‌ను సందర్శించి వస్త్రాలను పరిశీలించారు. తేలియా రుమాల్ వస్త్రం తయారీ విధానం, విశిష్టతపై తెలుసుకున్నారు. చేనేత జాతీయ ఆవార్డు గ్రహీతలు గూడ శ్రీను, గూడ పవన్, అనందం నాగరాజు, గజం సత్యనారాయణ తదితరుల ఆధ్వర్యంలో స్టాల్ ఏర్పాటు చేశారు.
ఆండాళ్ దేవికి ఊంజల్ సేవ
ఆండాళ్ దేవికి ఊంజల్ సేవ
ఆండాళ్ దేవికి ఊంజల్ సేవ


