బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి
నల్లగొండ టౌన్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ జేఏసీ చైర్మన్ మునాస ప్రసన్నకుమార్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు పెట్టి 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కలెక్టర్‌ట్‌లో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, సింగం లక్ష్మీనారాయణ, రమేష్‌గౌడ్, జనార్దన్, హరిబాబు, వెంకన దీపేందర్, నాగరాజు, తిరుపతయ్య, యాదగిరి, సతీష్, శంకరయ్య, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.


