రోడ్డు ప్రమాదాలను నివారిస్తాం
మిర్యాలగూడ అర్బన్ : జిల్లా పోలీస్ శాఖ.. అన్ని శాఖలను సమన్వయం చేసుకుని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటుందని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాల(బ్లాక్‌స్పాట్స్)ను ఆర్‌అండ్‌బీ, ఎకై ్సజ్, ఆర్టీఓ, హైవే ఇంజనీర్ అధికారులతో కలిసి పరిశీలించారు. మిర్యాలగూడ పరిధిలోని నందిపాడు ఎక్స్‌రోడ్డు, ఈదులగూడ ఎక్స్‌రోడ్డు, గూడూరు ఎక్స్‌రోడ్డు, దామరచర్ల బ్లాక్ స్పాట్లను సందర్శించి ప్రమాదాలు జరగడానికి గల కారణాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బ్లాక్‌స్పాట్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు, లైటింగ్, రంబుల్ స్టిక్స్, వేగనియంత్రణ సూచికలు, రాంగ్‌రూట్‌లో వాహనాలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో తరుచూ ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్స్ గతంలో 58 ఉండగా ప్రస్తుతం 41కి తగ్గిందని, నిరంతర పెట్రోలింగ్ చేస్తూ రోడ్డుపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏపీ నుంచి ధాన్యం రాకుండా నిఘా ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ కె.రాజశేఖరరాజు, రూరల్ సీఐ పీఎన్‌డీ.ప్రసాద్, వన్‌టౌన్ సీఐ నాగభూషణ్, ఎస్‌ఐలు లక్ష్మయ్య, రాంబాబు, శ్రీకాంత్‌రెడ్డి, అంజయ్య, రోడ్డు సెఫ్టీ ఇంజనీర్లు ఉన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్


