కంకర మిల్లులకు కొత్త రూల్స్
దరఖాస్తు చేసుకుంటున్న క్రషర్ మిల్లుల యజమానులు
రిజిస్ట్రేషన్ చేయించాలి
నల్లగొండ: ప్రభుత్వం కంకర మిల్లులకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇటీవల రంగారెడ్డి– వికారాబాద్ జిల్లాల పరిధిలో జరిగిన కంకర లారీ రోడ్డు ప్రమాదం సంఘటనను దృష్టిలో ఉంచుకుని గనులు, భూగర్భ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిబంధనలు జారీ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఖనిజాలను రవాణా చేయడంతోపాటు ఓవర్ లోడ్‌తో వాహనాలు వెళ్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున స్పందించిన ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే క్రషర్ మిల్లులకు, ఖనిజాన్ని సరఫరా చేసే వాహనాల విషయంలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది.
కొత్త నిబంధనలు ఇవీ..
● జిల్లాలో ఉన్న క్రషర్ మిల్లులు అన్నీ రూ.50 వేల చొప్పున చెల్లించి కచ్చితంగా మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
● ఇందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
● కొత్తగా క్రషర్ పెట్టేవారు కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
● క్రషర్ నడిపించాలంటే ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
● క్రషర్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. వేబ్రిడ్జిని కూడా వారు ఏర్పాటు చేసుకోవాల్సి
ఉంటుంది.
● క్రషర్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను మైనింగ్ స్టేట్ డైరెక్టర్ కార్యాలయానికి అనుసంధానం
చేయాల్సి ఉంటుంది.
అనుమతి పొందిన వాహనాలకు మాత్రమే..
ట్రాక్టర్లు, టిప్పర్లు, ఇతర ఏ వాహనమైనా ఇసుక, కంకర, ఇటుకలు, రాయి, మట్టి, రాయి పొడి తదితర ఏ ఇతర ఖనిజ సంపదను రవాణా చేయాలన్నా రూ.2వేలు చెల్లించి కచ్చితంగా జిల్లా కేంద్రంలోని ఏడీ మైన్స్ కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలి. అప్పుడు దాన్ని ఆన్‌లైన్ చేస్తారు. ఇక్కడ అనుమతి పొందిన వాహనాలు మాత్రమే ఖనిజ సంపదను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరఫరా చేయాల్సి ఉంటుంది.
ఫ ప్రతి మిల్లుకు రిజిస్ట్రేషన్
ఫ ఖనిజాలు సరఫరా చేసే ప్రతి వాహనానికి కూడా..
ఫ అనుమతి లేకుండా ఖనిజాలు సరఫరా చేస్తే కేసులే
ఫ జిల్లా గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారి సామ్యేల్ జాకబ్
జిల్లాలో 20 క్రషర్ మిల్లులు ఉన్నాయి. ఆ యజమానులంతా తిరిగి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 18 మంది దరఖాస్తు చేసుకున్నారు. 150 టిప్పర్ల యజమానులు కూడా రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
కంకర, ఇసుక, ఇటుక, రాయి తదితర ఖనిజా లను రవాణా చేసే వాహనాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి. రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా వాహనాల్లో ఖనిజాలను సరఫరా చేస్తే జరిమానాలతోపాటు కేసులు కూడా నమోదు చేస్తాం. కలెక్టర్ ఆధ్వర్యంలో డీఎల్‌ఎస్ కమిటీ ఇసుక సరఫరాను ప్రతి వినియోగదారుడికి సరసమైన ధరలకు అందించాలని నిర్ణయించింది. ట్రాక్టర్ యజమానులు, ఇతర బ్రోకర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. ఇటీవల కురిసిన వర్షాలతో వాగుల్లో వర్షం వచ్చి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. త్వరలోనే ఆ సమస్య పరిష్కారమవుతుంది.
–సామ్యేల్ జాకబ్, నల్లగొండ మైన్స్ ఏడీ
కంకర మిల్లులకు కొత్త రూల్స్


