కష్టపడితే అనుకున్న లక్ష్యం సాధించవచ్చు
రామగిరి(నల్లగొండ): కష్టపడితే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ అన్నారు. గురువారం జిల్లా గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. చదువును అలవాటుగా చేసుకుంటే ఆలోచన శక్తితోపాటు సృజనాత్మకత పెరుగుతుందన్నారు. పుస్తక పఠనం చేస్తే శాంతి, సహనం, చిత్తశుద్ధి అలవడుతుందన్నారు. అనంతరం వారం రోజులుగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, కార్యదర్శి బాలమ్మ, డీఎస్పీ టి.మల్లారెడ్డి, బాలికల జూని యర్ కాలేజీ ప్రిన్సిపాల్ సుధారాణి, బాలుర జూ నియర్ కాలేజీ ప్రిన్సిపాల్ యూసుఫ్‌ఖాన్, ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ ఎంవీ.గోనారెడ్డి పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్


